39.6 C
India
Saturday, April 27, 2024
More

    Ayyappa Swamy : రెండో రోజు దత్త పీఠంలో ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలు..

    Date:

    Ayyappa Swamy
    Ayyappa Swamy Vigraha Pratishtapana Mahotsavam 2nd Day

    Ayyappa Swamy : అమెరికాలోని న్యూ జెర్సీలోని సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘ప్రాణ ప్రతిష్ట’ వేడుకలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఆలయంతో పాటు ఎడిసన్ మొత్తం ఆధ్యాత్మికత వాతావరణాన్ని సంతరించుకుంది. ఆలయంలో జరగాల్సిన నిత్య కైంకర్యాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తుండడంతో పాటు విగ్రహ ఏర్పాట్లు కూడా చేపడుతున్నారు.

    హరి హర సుతుడు అయ్యప్ప స్వామి సాయి దత్త పీఠంలోని శ్రీ శివ విష్ణు దేవాలయంలో కొలువు దీరబోతున్నారు. స్వామి వారితో పాటు శ్రీ ఆది శంకరాచార్య, శ్రీ రామానుజాచార్య, కాల భైరవ మూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రాణ ప్రతిష్ట చేయబోతున్నారు. ఈ వేడుకల కోసం ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. మార్చి 17 (ఆదివారం) నుంచి మార్చి 20 (బుధవారం) వరకు వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

    ఇందులో భాగంగా మార్చి 17 (ఆదివారం)న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక పూజలు చేశారు. దేవతా అనుగని, గణపతి పూజ, పుణ్యహవచనం, కాలహస్తపానం, ధనలక్ష్మి పూజ, హారతి, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

    మార్చి 18 (సోమవారం) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గణపతి పూజ, పుణ్యహవచనం, వాస్తు శాంతి, మృత సంగ్రహనం, అంకురార్పణం, యజమాన ఆచార్య రక్షాబంధనం, నూతన విగ్రహ జనాధివాసం, కుంభాలంకారం, కాళహస్త పఠనం, అగ్ని ప్రతిష్ట, ఫస్ట్ కాలయాగ పూజ, పూర్ణాహుతి, హారతి, తీర్థ ప్రసాద వితరణం నిర్వహించారు.

    స్వామి వారల మూర్తులను శాస్త్రోక్తంగా ప్రాణ ప్రతిష్ట చేస్తున్నట్లు ఈ ఆధ్యాత్మిక వేడుకల కోసం భారత్ నుంచి ప్రత్యేకంగా పూజారులను పిలిపించినట్లు ఆలయ కమిటీ తెలిపింది. ప్రాణ ప్రతిష్ట రోజు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తుల అంచనాలను బట్టి మరింత పెంచుతామని పేర్కొన్నారు.

    All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director)

    More Images : Ayyappa Swamy Vigraha Pratishtapana Mahotsavam 2nd Day Photos

    Share post:

    More like this
    Related

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    American universities : అమెరికా యూనివర్సిటీలు.. అరెస్టులు

    American universities : అమెరికా యూనివర్సిటీలలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ...

    Swami Vivekananda : అమెరికాస్ ఫస్ట్ గురు : స్వామి వివేకానందపై డాక్యుమెంటరీ.. మేలో రిలీజ్..

    Swami Vivekananda : స్వామి వివేకానంద’ ఈ పేరు ఒక్కటి చాలు...

    Counselor Camp : ఏప్రిల్ 27న వర్జీనియాలో కౌన్సిలర్ క్యాంప్

    Counselor Camp : భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ DC VFS...

    World Leadership : అమెరికా వైదొలిగితే.. ప్రపంచ నాయకత్వ బాధ్యతలు ఎవరివి?: బైడెన్‌

    World Leadership Comments Biden World Leadership : ఇండియాలో జరుగుతున్న ఎన్నికలకు...