36.8 C
India
Thursday, May 2, 2024
More

    BJP Fourth List : బీజేపీ ఫోర్త్ లిస్ట్.. ఎవరెవరికి స్థానం దక్కిందంటే..

    Date:

    BJP Fourth List
    BJP Fourth List

    BJP Fourth List : శాసన సభ ఎన్నికలు 2023కు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఫోర్త్ (నాలుగు) లిస్ట్ ను రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో తమ అభ్యర్థులను నియమించుకునేందుకు ఇద్దరు సీనియర్ నేతలు బాహా బాహీ తలపడినట్లు తెలుస్తోంది. 12 మందితో కూడిన ఈ నాలుగో లిస్ట్ తో బరిలో నిలిచే 100 మందిని బీజేపీ ఇప్పటి వరకు ప్రకటించింది. ఇక మిగిలిన 19 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయలేదు.

    జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కిషన్ రెడ్డిని కలవడం, ఢిల్లీకి వెళ్లడం నేపథ్యంలో  బీజేపీ+జనసేన పోటీ చేస్తాయని టాక్ వచ్చింది. అయితే సీట్ల పంపకాల విషయం ఇప్పటి వరకు కొలిక్కి రాకపోవడంతో ఈ 19 స్థానల్లో తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది.

    బీజేపీ నాలుగో లిస్ట్ లో ఒకే ఒక్క మహిళ (తుల ఉమ)కు ఛాన్స్ ఇచ్చింది. వేముల వాడకు సీటుకు సంబంధించి వికాస్ రావు పేరు మొదటి నుంచి అందరూ అనుకున్నా.. తుల ఉమ పేరును అధిష్టానం ఖరారు చేసింది. తన అనుచరురాలైన తుల ఉమకు టికెట్ ఇప్పించుకోవడంలో ఈటల రాజేందర్ సక్సెస్ అయ్యాడని తెలుస్తోంది. ఈ టికెట్ బండి వర్సెస్ ఈటల అన్నట్లుగా సాగిందని పార్టీలో టాక్.. అయితే చివరికి ఈటల సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. హుస్నాబాద్ టికెట్ విషయంలో కూడా ఇద్దరు తలపడినట్లు తెలుస్తోంది. ఇక్కడ బండివైపే అధిష్టానం మొగ్గు చూపింది. బండి సంజయ్ ప్రతిపాదించిన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి అధిష్టానం కేటాయించింది. ఈటల ప్రతిపాదించిన సురేందర్ రెడ్డి పేరును అధిష్టానం పక్కన పెట్టింది.

    అభ్యర్థుల జాబితా ఇలా..
    చెన్నూర్: దుర్గం అశోక్
    వేముల వాడ: తుల ఉమ
    ఎల్లారెడ్డి: సుభాష్ రెడ్డి
    హుస్నాబాద్: శ్రీరామ్ చక్రవర్తి
    వికారాబాద్: నవీన్
    సిద్ధిపేట: శ్రీకాంత్ రెడ్డి
    కొడంగల్: బంటు రమేష్ కుమార్
    మిర్యాల గూడ: సాధినేని శ్రీనివాస్
    గద్వాల: బోయ శివ
    మునుగోడు: చలమల క్రిష్ణారెడ్డి
    ములుగు (ఎస్టీ): అజ్మీరా ప్రహ్లాద్ నాయక్
    నకిరేకల్ (ఎస్సీ): నకరకంటి మొగులయ్య

    PRESS RELEASE–4th List of BJP candidate for General Election to the Legislative Asembly of Telangana on 06.11.2023

    Share post:

    More like this
    Related

    NATS Tampa Bay : అనాథలకు ‘నాట్స్ టాంపాబే’ చేయూత

    NATS Tampa Bay : నార్త్ అమెరికన్ తెలుగు సంఘం (నాట్స్)...

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    AstraZeneca : కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై ఆందోళన వద్దు: ఆస్ట్రాజెనెకా

    AstraZeneca : తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది....

    MARD Party : మగాళ్లకు అండగా పార్టీ ఏర్పాటు

    MARD Party : జాతీయ స్థాయిలో ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఆకట్టు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Poll Tracker Survey : తెలంగాణలో ఆ పార్టీకి మూడో స్థానమే..తాజా సర్వే సంచలనం

    Poll Tracker Survey : దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి పెరిగింది....

    Sonia Gandhi : సోనియా గాంధీ పోటీ కోసం మూడు నియోజకవర్గాల పరిశీలన? 

    Sonia Gandhi : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం నుంచి...

    బండి పదవీ పోవడానికి కారణం కేసిఆర్ఃమంత్రి పోన్నం

    మాజీ సీఎం కేసీఆర్ ప్రోద్బలంతోనే కరీంనగర్ MPబండి సంజయ్ కుమార్ ను...