33.8 C
India
Sunday, May 5, 2024
More

    Rohit Sharma : రోహిత్ కు బైబై.. హార్దిక్ కు సైసై..ఫ్యాన్స్ కు ముంబై ఇండియన్స్ షాక్!

    Date:

    Rohit Sharma
    Rohit Sharma and Pandya
    Rohit Sharma : ముంబై ఇండియన్స్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మను కాదని, హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించింది. ఈమేరకు నిన్న ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. రీసెంట్ గా గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ ను ముంబై ఇండియన్ ట్రాన్స్ ఫర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది ఐపీఎల్ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ హార్దిక్ ను ఎందుకు వదిలేసుకుందా అనే అనుమానం అందరికీ కలిగింది. ఎందుకంటే గుజరాత్ జట్టును హార్దిక్ అద్భుతంగా ముందుకు నడిపించాడు. జట్టును రెండు సార్లు ఫైనల్ కు చేర్చడంతో పాటు 2022 సీజన్ లో విజేతగానూ నిలిపాడు.

    హార్దిక్ పాండ్యా సంగతి అలా ఉంచితే రోహిత్ శర్మ 2013 నుంచి ముంబై ఇండియన్స్ జట్టుు కెప్టెన్ గా ఉన్నాడు. ఆ జట్టకు 5 టైటిళ్లను సాధించి పెట్టిన ఘనత కూడా అతడిదే. ఐపీఎల్ లో గొప్ప కెప్టెన్ గా పేరురావడంతో టీమిండియా పగ్గాలు కూడా అప్పగించారు. దాన్ని కూడా రోహిత్ సద్వినియోగం చేసుకున్నాడు. ఎన్నో విజయాలతో భారత్ ను నంబర్ వన్ గా నిలిపాడు. కానీ అనూహ్యంగా ముంబై జట్టు రోహిత్ స్థానంలో హార్దిక్ ను తీసుకురావడంపై అభిమానులను షాక్ కు  గురిచేసింది.

    అయితే ఫ్యూచర్ లో ఎప్పటికైనా హార్దిక్ ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ అవుతాడనే అంతా భావించారు. ఉన్నట్టుండి రోహిత్ ను పక్కనపెట్టి హార్ధిక్ ను కెప్టెన్ చేయడంపైనే అందరికీ ఆశ్చర్యం కలుగుతోంది. కెప్టెన్సీ పోవడంతో రోహిత్ ఇక ఐపీఎల్ కు గుడ్ బై చెపుతారని చర్చ నడుస్తుండడంతో హిట్ మ్యాన్ ఫ్యాన్స్ గుండెలు పగులుతున్నాయి.

    ఈ నిర్ణయాన్ని ముంబై ఇండియన్స్ మాత్రం సమర్థించుకుంటోంది. హెడ్ ఆఫ్ పెర్ఫార్మన్స్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మహేలా జయవర్ధనే మాట్లాడుతూ.. భవిష్యత్ కు ముంబైని రెడీ చేయడంలో ఇది భాగం. గతంతో సచిన్ నుంచి హర్భజన్ కు, రికీ నుంచి రోహిత్ ఈ బదలాయింపు జరిగింది. వారందరూ ముంబైకి ఎన్నో విజయాలు, పేరు సాధించి పెట్టారు. ఇప్పుడదే ఉద్దేశంతో 2024 సీజన్ కు హార్దిక్ కెప్టెన్సీ వహిస్తారు’’ అని స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం ముంబైని మరింత బలోపేతం చేయడానికి రోహిత్ గైడెన్స్, అనుభవం మైదానం లోపల, వెలుపల ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు.

    Share post:

    More like this
    Related

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో 19 మంది మృతి

    Telangana : తెలంగాణలో ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మరణిస్తున్నారు....

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    Rohit Sharma : రికార్డుల రారాజు రోహిత్ శర్మ మన తెలుగోడే.. నేడు హిట్ మ్యాన్ బర్త్ డే

    Rohit Sharma : ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా...

    MI VS RR : ముంబయి ఇండియన్స్ పై రాజస్థాన్ ఘన విజయం 

    MI VS RR : ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య  సవాయ్...

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాను ఇబ్బందుల్లోకి నెట్టనున్న రోహిత్ శర్మ?

    Hardik Pandya : కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ ప్రస్తుతం...