
Congress sensation : కాంగ్రెస్ పార్టీ సంచలనం సృష్టించింది. 35 ఏండ్ల చరిత్రను తిరిగి రాసింది. ఇక ప్రభుత్వం ఏర్పాటుకు వడివడిగా అడుగులు వేస్తున్నది.136 సీట్లు గెలిచి అతి పెద్ద పార్టీ గా గెలిచింది. కర్ణాటక వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. అయితే కర్ణాటకలో విజయం కాంగ్రెస్ విజయంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ ఏడాది జరగనున్న మరో ఐదు రాష్ర్టాల ఎన్నికలపై చర్చ మొదలైంది. దేశ వ్యాప్తంగా కేంద్రంలోని బీజేపీ కి వ్యతిరేక పవనాలు మొదలయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బీజేపీ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నే ఇప్పటికీ ప్రజలు భావిస్తున్నారని అర్థమవుతున్నదని స్పష్టమైందని చెబుతున్నారు. మరో పార్టీకి జాతీయ రాజకీయాల్లో అవకాశమే లేదని చెబుతున్నారు. బీజేపీ ప్రభావం తగ్గతుందనడానికి ఈ ఫలితాలు నిదర్శనమని జర్నలిస్ట్ సర్కిళ్లలో కూడా టాక్ నడుస్తున్నది.
మోదీ ప్రభావం తగ్గతున్నదా..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. అసలు ఎవరూ ఊహించని సీట్లను గెల్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. బీజేపీ కి అన్నీ తానై ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించారు. రాష్ర్ట నాయకులకు ఆయన అవకాశం ఇవ్వకుండా 40 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. మరోవైపు అమిత్ షా, నడ్డా కూడా తిరిగారు. అయినా బీజేపీని ప్రజలు వ్యతిరేకించినట్లుగా స్పష్టమవుతున్నది.
2024 ఎన్నికలకు ముందుకు ఇది బీజేపీ కి పెద్ద దెబ్బగానే భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇదో క వరంగా మారబోతున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొంత లాభం టీపీసీసీకి ఉంటుందని అభిప్రాయపడుతన్నారు. రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రాబల్యానికి కొంత తిరుగుముఖం తప్పదని చెబుతున్నారు. మత రాజకీయాలు కాకుండా, అభివృద్ధి అంశాలపై బీజేపీ ఎక్కడా దృష్టి పెట్టడం లేదని ప్రధానంగా మెజార్టీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.