
Good medicine : మన ఇంట్లో దొరికే వాటితోనే మనకు చాలా వరకు రోగాలు పోతాయి. వంటింట్లో లభించే అల్లంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అల్లంలో కార్బోహైడ్రేడ్లు, ఫైబర్, విటమిన్ బి3, బి6, సి, ఐరన్, పొటాషియం, మెగ్నిషియం, ఫాస్పరస్, జింక్, ఫోలేట్, నియాసిన్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. మహిళల ఆరోగ్యానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది.
మహిళలకు నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్లు లాగడం, వాంతులు, కళ్లు తిరగడం, నీరసం, చికాకు, తిమ్మిర్లు వంటి సమస్యలు వేధిస్తాయి. నెలసరిలో వచ్చే సమస్యలకు అల్లం చక్కనైన పరిష్కారం చూపుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటంతో మహిళల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
మలబద్ధకం సమస్యకు చెక్ పెడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలను మలబద్ధకం సమస్య ఇబ్బంది పెడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగుల్లో కదలికలు తెస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. దీంతో గుండె జబ్బుల ముప్పు ఉండదు. అధిక బరువును కంట్రోల్ చేస్తుంది. ఉదయం సమయంలో గ్లాసులో నీళ్లు పోసి మరిగించి అందులో అల్లం ముక్క వేసి వేడిచేసి తరువాత వాటిని వడగట్టి అందులో తేనె, పుదీనా ఆకులు వేసుకుని తాగితే మంచి లాభాలుంటాయి.
మహిళలకు వచ్చే పీసీవోఎస్ సమస్యల నుంచి దూరం చేస్తుంది. అల్లంతో మహిళలకు వచ్చే రోగాలను నయం చేసుకోవచ్చు. ఇలా మహిళల జీవితంలో అల్లం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే అల్లంను వాడుకుని మనకు వచ్చే రుగ్మతల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.