- సీఎం ప్రమాణ స్వీకారానికి అందని ఆహ్వానం

CM KCR : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఏకంగా 135 స్థానాల్లో గెలుపొంది సంచలనం సృష్టించింది. ఇప్పటికే సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ పేర్లను అధిష్టానం ప్రకటించింది. మరోవైపు వీరితో పాటు మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల నేతలకు ఆహ్వానాలు అందాయి. మరి సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందిందా అనేది ఇక్కడ అంతా చర్చ సాగుతున్నది.
అయితే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే బిహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, తమిళనాడు, జార్ఖండ్, బెంగాల్ సీఎంలు స్టాలిన్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ, సీపీఐ అగ్రనేతలు సీతారాం అచూరీ, డీ రాజా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ర్ట మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే, నటుడు కమలాహాసన్ సహా మరెందరో ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ కు మాత్రం ఆహ్వానం అందలేదని సమాచారం. ఆయనతో పాటు ఏపీ సీఎం జగన్, ఢిల్లీ, కేరళ సీఎంలకు కూడా ఆహ్వానాలు ఇప్పటివరకు అందలేదని సమాచారం. అయితే సీఎం జగన్ ను మొదటి నుంచి కాంగ్రెస్ దూరం పెడుతూనే వస్తున్నది.