29.4 C
India
Saturday, April 27, 2024
More

    Peace of mind : ఇంట్లో ప్రశాంతత కోసం ఇలా చేయండి

    Date:

    peace of mind
    peace of mind

    Peace of mind : జ్యోతిష్యం ప్రకారం మన వంట గదికి కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. వంట గదిలో కేవలం వంట చేసుకోవడానికే కాదు అందులో మన రోగాలను నయం చేసే పలు పదార్థాలు కూడా ఉంటాయి. వంట గదిలో ఉండే వాటితో మన రోగాలను దూరం చేసుకోవచ్చు. ఇందులో వెల్లుల్లి, అల్లం, ధనియాలు, మిరియాలు అన్ని ఉంటాయి. అందుకే వంటింట్లో ఉండే పదార్థాలతోనే మనకు రోగాలను దూరం చేసుకునే అవకాశం ఉంటుంది.

    వంటింట్లో కొన్ని ఉంచుకోకూడదు. వాటిని ఉంచుకోవడం వల్ల మనకు వాస్తు దోషాలు ఏర్పడతాయి. వంట గదిలో ప్రతికూల ప్రభావాలు కలిగించే వాటిని ఉంచుకోవడం మంచిది కాదు. వంట గదిలో ఎప్పుడు కూడా విరిగిన తవాలను ఉంచుకోకూడదు. అలా ఉంచుకుంటే ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడి నష్టాలు కలగవచ్చు. అందుకే వాటిని బయట పారేయడమే ఉత్తమం.

    ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండాలంటే ప్రతి రోజు పడుకునే ముందు వంట గదిలో ఉండే బాణలిలో పసుపు వేసి ఉంచుకుంటే మనకు బాధల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు రాకుండా ఉంటుంది. ఇంట్లో ఒత్తిడి, బాధల నుంచి బయట పడాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కష్టాలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది.

    ఇంట్లో ఎప్పుడు కూడా తవాను తలకిందులుగా పెట్టుకోవద్దు. అలా పెడితే మనకు సమస్యలు ఎదురవుతాయి. తలకిందులుగా ఉంచితే దానిపై గుడ్డ కప్పాలి. ఇంట్లో శాంతి నెలకొనాలంటే రాత్రి పడుకునే సమయంలో దానిపై ఆవనూనెతో దీపం పెట్టాలి. ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు రాకుండా ఉంటాయని గుర్తుంచుకోవాలి.

    ప్యాన్ హ్యాండిల్ విరిగిపోతే అలాగే ఉంచకూడదు. దాన్ని పడేసి కొత్తది కొనుగోలు చేసుకోవాలి. లేదంటే దానికి ఓ దారం కట్టాలి. విరిగిన తవాను ఇంట్లో ఉంచుకోవడం వల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది. ప్రశాంతమైన జీవితం కోసం తవాపై మట్టి దీపం వెలిగించాలి. ఆ మట్టి తీసి నల్ల కాగితంపై వేసి నిర్జన ప్రాంతంలో విసిరేయాలి.

    Share post:

    More like this
    Related

    Infosys Narayanamurthy : అనారోగ్యంతో ఉన్నా.. ఓటు వేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

    Infosys Narayanamurthy : లోక్ సభ రెండో విడత ఎన్నికల్లో భాగంగా...

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో రైతు కుమారుడు ఆల్ ఇండియా నెం.1

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో ఓ రైతు కుమారుడు...

    Varun Tej Campaign : రేపు పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

    Varun Tej Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం...

    MLA Harish Rao : స్పీకర్ కు ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖ

    MLA Harish Rao : ఈరోజు శాసనసభ స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Peace of mind : మనసుకు కాస్త కళ్లెం వేయండి

    peace of mind : అన్ని సమస్యలకు మనసే మూలం. కోరికలకు...