Oiling Hair : ప్రస్తుత రోజుల్లో జుట్టుకు నూనె రాసుకోవడం చేయడం లేదు. చిన్నప్పుడు మన జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల కుదుళ్లు బలంగా ఉండేవి. ప్రస్తుతం ఆ పని ఎవరు చేయడం లేదు. నూనె రాసుకుంటే అదో చిన్నతనంగా భావిస్తున్నారు. నూనె రాసుకోకపోవడమే ఫ్యాషన్ గా చూస్తున్నారు. దీంతో జుట్టుకు అనేక సమస్యలు వస్తున్నాయి. అయినా లెక్క చేయడం లేదు.
జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయనే సంగతి మరచిపోయారు. నూనె రాయకపోవడం వల్ల జుట్టు తెల్లబడటం, రాలిపోవడం లాంటి సమస్యలు వస్తాయని తెలుసుకోవడం లేదు. ఈనేపథ్యంలో జుట్టుకు నూనె రాయడం చాలా ముఖ్యమనే విషయం పక్కన పెట్టేస్తున్నారు. దీని వల్ల చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
జుట్టుకు నూనె రాయడం వల్ల రక్తప్రసరణ బాగుంటుంది. జుట్టు తెల్లబడటం, రాలిపోవడం ఆగుతుంది. వెంట్రుకలు బలంగా కావడానికి దోహదపడుతుంది. రోజు రాయకున్నా కనీసం వారానికి మూడుసార్లు రాయడం వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది. జుట్టుకు నూనె రాసుకుంటే చల్లదనం కలుగుతుంది. ఒత్తిడి దూరం అయి మనసు ప్రశాంతంగా ఉంటుంది.
కొబ్బరి, ఆలివ్, బాదం, ఉసిరి వంటి నూనెలు రాయడం వల్ల చుండ్రు లేకుండా పోతుంది. జుట్టు నెరవడం తగ్గుతుంది. రాత్రి పడుకునే ముందు నూనె రాసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. తెల్లవారి తలస్నానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇలా చేయడం వల్ల జుట్టుకు చుండ్రు తగ్గి బాగా పెరిగేందుకు కారణమవుతుంది. ఇలా నూనె రాసుకోవడం మేలే కానీ కీడు మాత్రం కాదు.