Reasons For Divorce :
ప్రస్తుతం చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. చిన్న చిన్న తగాదాలకే ఇగోలకు పోతున్నారు. డైవర్స్ కోసం తాపత్రయపడుతున్నారు. ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది తమ సంసారాల్లో ఒడిదుడుకులు తెస్తున్నాయి. విదేశాల్లో ఇంకా ఎక్కువ మంది జంటలు విడిపోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఒత్తిడి, ఆందోళనలతో కాపురాలను కకావికలం చేస్తున్నారు.
పెళ్లయిన తరువాత స్వేచ్ఛ లేకపోతే ఇబ్బందిగా ఫీలవుతారు. ఇన్నాళ్లు తల్లిదండ్రులతో సంతోషంగా గడిపిన వారు ఇక జీవిత భాగస్వామి అదుపులో ఉండాల్సి వస్తుంది. దీంతో ఇద్దరి మధ్య సమన్వయం లేకపోతే గొడవలు వస్తాయి. అవి చిలికి చిలికి గాలి వానగా మారి విడాకులకు దారి తీస్తాయి. ఈ నేపథ్యంలో చాలా మంది స్వతంత్ర భావాలున్న వారికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది.
పురుషులతో సమానంగా ఆర్థిక వెసులుబాటు కావాలని చూస్తారు. ప్రతి పైసా విలువ గుర్తిస్తారు. ఖర్చు చేసే డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య సమన్వయం ఉండాలి. ఇంటి ఖర్చులు ఇద్దరికి తెలిసే ఉండాలి. లేకపోతే గొడవలు రావడం సహజం. అవి హద్దు మీరితే ఇబ్బందులు తప్పవు. భార్యాభర్తలు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
చాలా మంది భార్యాభర్తలు మొదట ఇద్దరి మధ్య ఎంతో అన్యోన్యతతో ఉంటారు. తరువాత కాలంలో ఇద్దరి మధ్య అపార్తాలు రావడం సహజం. అప్పుడే ఇద్దరు తమ మాటే గెలవాలని వాదిస్తూ ఉంటారు. దీంతోనే ఇద్దరి మధ్య వాగ్వాదం పెరుగుతుంది. నిర్లక్ష్యంతో ఉంటే తగిన ప్రతిపలం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా విడాకుల వరకు వెళ్లడం జరుగుతుంది.