Divorce : నేడు మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. భర్తతో శృంగారానికి భార్య నిరాకరిస్తే భర్త విడాకులు తీసుకోవచ్చని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు జస్టిస్ షీల్ నాగ్, వినయ్ సరాఫ్ లతో కూడిన ధర్మాసనం ఈరోజు ఈ తీర్పును వెల్లడించింది. భార్యాభర్తలు మధ్య ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో గొడవ పడుతూ ఉంటారు. అనేక సమస్యల వల్ల కొన్ని సందర్భాల్లో భర్త అడిగినప్పుడు భార్య శృంగారానికి ఒప్పు కోదు. మరికొన్ని సందర్భాల్లో కావాలని భర్తను దూరం పెట్టాలని కొంతమంది మహిళలు ఇలా చేసే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ లో ఇలాంటి సంఘటన ఓ వ్యక్తికి ఎదురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆ వ్యక్తి హై కోర్టులో పిటిషన్ వేయగా హైకోర్టు ఎవరు ఊహించని విధంగా సంచలన తీర్పును ఇచ్చింది.
Breaking News