Diabetes మనకు రుచిని అందించే కూరల్లో గోంగూర ఒకటి. తింటే రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్, పొటాషియం, ఐరన్, కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు కలిగిస్తుంది. విటమిన్ ఎ, బి1, బి2, బి9, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రోజు గోంగూర తినడం వల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. మధుమేహాన్ని కూడా నియంత్రణలో ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతుంది. షుగర్ పేషెంట్లకు ఇది దివ్యమైన ఆహారం. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. శ్వాస వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. దగ్గు, జలుబు, ఆయాసం వంటి అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. కంటి ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. గోంగూర రసం తాగడం వల్ల రేచీకటి లేకుండా పోతుంది. విరేచనాల సమస్య ఉన్న వారు గోంగూర ఎక్కువగా తింటే మంచిది. ఇలా గోంగూరతో మనకు చాలా రకాల ప్రయోజనాలు దక్కుతాయి.
గోంగూర పుల్లగా ఉంటుంది. దీంతో నోటికి రుచి పుడుతుంది. అన్నంతో తిన్నా చపాతీలతో తిన్నా భలే రుచిగా ఉంటుంది. దీంతో గోంగూరను అందరు ఇష్టపడుతుంటారు. తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైన కూరల్లో ఇది ఒకటి. దీన్ని పచ్చడిగా కూడా పెట్టుకోవచ్చు. గోంగూరలో ఉండే టేస్టీ వేరుగా ఉంటుంది. రోజు తిన్నా బోరు కొట్టకుండా ఉండేది ఇదే.
మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేయడంలో గోంగూర ముందుంటుంది. మన శరీరంలో కలిగే మార్పులకు ఇదే ప్రధాన కారణంగా నిలుస్తుంది. అందుకే గోంగూరతో చేసిన కూరలు మన నాలుకకు రుచిగా ఉంటాయి. దీంతో గోంగూర తినడం వల్ల మన తెలుగు వారికి గోంగూర అంటే ఓ రకమైన ఇష్టం. అందుకే గోంగూరతో పలు రకాల పదార్థాలు చేసుకుని తినడం సహజం.