
Corn Silk Tea Benefits :
మొక్కజొన్నలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే పీచుతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ పీచచులో విటమిన్ బి2, విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పీచుతో టీ చేసుకుని తాగితే ఆరోగ్యానికి లాభం చేకూరుస్తుంది. మొక్కజొన్న పొట్టు తీసిన తరువాత పీచును తీసుకోవాలి. దాన్ని కడిగి ఒక పాత్రలో వేసుకుని రెండు గ్లాసులు నీళ్లు పోసి మరిగించి వడకట్టుకుని అందులో తేనె వేసుకుని తాగితే మంచిది.
మొక్కజొన్న పీుతో తయారు టీతో యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఇందులో ఉండే ఇన్ఫ్లమేటరీ గుణాలు మూత్రనాళంలో మంటను తగ్గిస్తాయి. బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. మగవారిలో ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయేలా చేస్తుంది. ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు ఉండటం వల్ల షుగర్ పేషెంట్లకు దోహదపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. బరువు తగ్గించేందుకు కూడా పీచు ఎంతగానే మేలు కలిగిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలో ఏర్పడే కొవ్వు కరిగిస్తుంది. కిడ్నీల్లో రాళ్లు రాకుండా నిరోధిస్తుంది. వారానికి మూడు నుంచి నాలుగు సార్లు ఈ టీ తాగడం వల్ల చాలా రకాల లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా మొక్కజొన్న పీచు శరీరానికి మేలు చేస్తుంది. పూర్వం రోజుల్లో అన్నం దొరకక ముందు మొక్కజొన్న గడక తినేవారు. దాంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు మనం తినే ఆహారాలు మారిపోయి రోగాల బారిన పడుతున్నాం. దీని పీచుతో తయారు చేసుకునే టీ వల్ల డయాబెటిస్ నుంచి రక్షణ కలిగిస్తుంది. దేహానికి ఎలాంటి హాని కలగకుండా చేస్తుంది.