Tiktok Srinu : ఒంటరితనం నరకమే. అదో శాపం. అందరు ఉన్నా దూరం కావడంతో విరక్తితో ప్రాణాలు తీసుకున్నాడు. టిక్ టాక్ లు చేస్తూ అందరికి వినోదం పంచే అతడి జీవితం సాఫీగా సాగుతుందనుకుంటే విధి వైపరీత్యం చూపింది. తన భార్య, పిల్లలు కానరానిలోకాకు వెళ్లడంతో ఇక నేను బతికి ఏం లాభం అనుకుని చివరకు తను కూడా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది.
పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేటకు చెందిన యడ్లపల్లి శ్రీనివాస్ అలియాస్ టిక్ టాక్ శ్రీనుగా పరిచయం. సగ్గొండ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. 8 ఏళ్ల క్రితం తన ఇద్దరు పిల్లలు పాము కాటుతో చనిపోయారు. తరువాత ఓ బాలికను దత్తత తీసుకుని జీవనం సాగిస్తుండగా రెండేళ్ల క్రితం భార్య కూడా చనిపోయింది. దీంతో వైరాగ్యంలోకి వెళ్లిపోయాడు.
శనివారం మధ్యాహ్నం కొవ్వూరు రోడ్ కం రైలు బ్రిడ్జిపై ద్విచక్ర వాహనం నిలిపి గోదావరిలో దూకేశాడు. పడవ కార్మికులు గమనించి రక్షించాలని చూసినా అప్పటికే ప్రాణాలు వదిలాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. హతుడి మేనల్లుడు పవన్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
పచ్చని సంసారంలో విధి విలాపం చూపింది. కుటుంబ సభ్యులను తనకు దూరం చేసింది. దీంతో తట్టుకోలేని శ్రీను చివరకు తన ప్రాణాలు విడవాలని నిర్ణయించుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఇందులో భాగంగానే నదిలో దూకి ప్రాణాలు విడిచాడు. తనకు ఎవరు లేరనే ఉద్దేశంతోనే ఆత్మహత్య చేసుకున్నాడు.