39.6 C
India
Thursday, May 9, 2024
More

    Divya Bharti : తెరపైకి మరో హీరోయిన్ బయోగ్రఫీ.. డెత్ మిస్టరీ వీడేనా?

    Date:

    Divya Bharti :

    సినిమా నటీనటుల జీవితాలు తెరపై ఒకలా.. తెర వెనుక మరోలా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే గుర్తింపు. లేదంటే ఎంత పెద్ద స్టార్ హీరో హీరోయిన్ అయినా లెక్క చేయని పరిస్థితి. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నం హీరో హీరోయిన్లు చేస్తున్నారు.

    ఈ విషయంలో హీరోల పరిస్థితి కొంత బెటర్ గానే ఉన్నప్పటికీ.. హీరోయిన్ల పరిస్థితి మాత్రం మరోలా ఉంటుంది. గ్లామర్.. ఫేమ్ ఉంటేనే హీరోయిన్లకు గుర్తింపు లేదంటే మాత్రం వారి పరిస్థితి దయనీయంగా ఉంటాయని ఎన్నో సంఘటనలు నిరూపించాయి. మహానటి సావిత్రి విషయంలో ఇదే జరిగింది. ఇక తెరపై ఓ వెలుగు వెలిగిన కొంతమంది అర్థాంతరంగా మరణించడం మిస్టరీగా మారింది.

    హీరోయిన్ దివ్యభారతి.. సిల్క్ స్మిత.. సౌందర్య.. శ్రీదేవి వంటి హేమాహేమీల మరణాలు ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉన్నాయి. వీరిపై సినిమాలు వస్తున్నాయని తెలియగానే ఎన్నో అడ్డంకులు సైతం వస్తున్నాయి. కొన్ని పట్టాలెక్కకుండానే ఆగిపోవడం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటిలో దివ్య భారతి బయోగ్రఫీ ఒక్కటి. ఆమె బయోగ్రఫీ తెరకెక్కించాలని ఎంతోమంది డైరెక్టర్లు ప్రయత్నించినా నేటికి సాధ్యం కాలేదు.

    దర్శకుడు అరుణ్ గోపీ మాత్రం దివ్య భారతి బయోగ్రఫీ ‘బాంద్రా’ పేరుతో మలయాళంలో తెరకెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దివ్యభారతి పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా కన్పించనుండగా.. మళయాలీ హీరో దిలీప్ లీడ్ రోల్ చేయనున్నాడు. ఈ సినిమాలో నాడు బాలీవుడ్లో తెరవెనుక జరిగిన చీకటి కోణాలతో పాటు దివ్యభారతి డెత్ మిస్టరీని దర్శకుడు చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

    దివ్య భారతి ముంబైలోని తన సొంత ఫ్లాట్ పై అంతస్తు నుంచి కింద పడి చనిపోయింది. ఆమె అధికారిక నివాసంపైనే దర్శకుడు సినిమా షూటింగ్ చేసేందుకు కూడా ప్లాన్ చేశాడని వినికిడి. ఆమె డెత్ ను ముంబై పోలీసులు యాక్సిడెంట్ గా ఫైల్ చేసి కేసును మూసివేశారు. ఏది ఏమైనా దివ్యభారతి బయోగ్రఫీ తెరకెక్కితే మాత్రం అది ప్యాన్ ఇండియా స్టోరీగా మారే అవకాశం కన్పిస్తోంది. దీంతో ఈ సినిమా మలయాళంకే పరిమితం కాకుండా హిందీ.. తెలుగులోనూ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌...

    KTR : రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సూచన.. ఇవి దగ్గరపెట్టుకోండి

    KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) ద్వారా...

    America : అమెరికాలో తెలుగు విద్యార్థి మిస్సింగ్..

    America : అమెరికాలో ఇటీవల జరుగుతున్న యాక్సిడెంట్స్, మిస్సింగ్స్, మర్డర్స్ భారతీయులను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related