32.5 C
India
Sunday, May 5, 2024
More

    Idiot to Animal : ‘‘ఇడియట్’’ నుంచి ‘‘యానిమల్’’ వరకు.. మనోడు ఏది చేసినా కరెక్టే!

    Date:

     

    Idiot to Animal
    Idiot to Animal Heroism

    Idiot to Animal : మన దేశంలో సినిమాలకు ఉన్నంత క్రేజ్ మరే దేశంలోనూ ఉండదు. సినిమాను మనం అంతగా ప్రేమిస్తాం. అభిమాన నటుడిని ఆరాధిస్తాం. మన హీరోను ఓ రేంజ్ లో ఊహించుకుంటాం. అతడు ఏదీ చేసినా కరెక్ట్..వందమంది విలన్లను చితక్కొట్టాలి. ఇద్దరు హీరోయిన్లతో డ్యూయెట్లు పాడాలి.. మధ్యలో ఓ ఐటెం సాంగ్ ఊపేయ్యాలి.. ఇలా ఫ్యాన్స్ ఎక్సట్రార్డినరీగా ఆలోచిస్తుంటారు. మన ఆలోచనలు బట్టే డైరెక్టర్లు కూడా క్యారెక్టర్లు, సీన్లు క్రియేట్ చేస్తుంటారు. మన తెలుగు డైరెక్టర్లు రోటిన్ గా ఫాలో అవుతున్న విషయం ఒకటుంది.. హీరోయిన్లను హీరో ఏడిపించే సీన్లు. ఇవే ఆడియన్స్, ఫ్యాన్స్ తెగ అలరిస్తూ ఉంటాయి. ఈ ఫార్ములా గతంలో ఎన్నె సినిమాల్లో ఉన్నా.. రవితేజ, పూరిల ‘‘ఇడియట్’’ నుంచి వర్కవుట్ బాగా అయ్యింది. ఈ ఏడిపించే ఫార్ములా కొన్ని వందల సినిమాల్లో వచ్చింది. అయితే కొన్ని సూపర్ హిట్ మూవీల గురించి మాత్రం చర్చిద్దాం.

    ఇడియట్ మూవీలో హీరోయిన్ ను హీరో చస్తానని చెప్పి లవ్ లో పడేస్తాడు. ఇందులో విలన్ చేసే పనులన్నీ చేసి హీరోయిజం నిరూపించుకుంటాడు. అతడు హీరో కాబట్టి మనం అతన్ని ఫాలో అయిపోవాల్సిందే. అదే హీరో ఇతర అమ్మాయిని ఎవరైనా ఏడిపిస్తే..వాన్ని తన్నిపడేస్తాడు. తాను చేస్తే హీరో.. ఇతరులు చేస్తే విలన్. కానీ మనం హీరోను ఫాలో అవుతుంటాం కాబట్టి అవన్నీ పట్టించుకోక ఆ సీన్లను తెగ ఎంజాయ్ చేస్తుంటాం.

    ‘‘అర్జున్ రెడ్డి..’’ ఈ మూవీ పేరు లేకుండా ఈ లిస్టే ఉండదు లెండి. ఇందులో హీరో హీరోయిన్ ను ప్రేమ పేరుతో మాట్లాడే మాటలు, హీరోయిన్ తో ప్రవర్తించే విధానం.. అవన్నీ చేస్తే హీరోయిజం ఎక్కువన్నమాట. ఇలాంటి వాటికి ఈ సినిమా బ్రాండ్ అంబాసిడర్ అనే చెప్పుకోవాలి. ఇక ‘పుష్ప’లో పుష్ప రాజ్ శ్రీవల్లిని ప్రేమించిన విధానం. మొదట్లో ఆమెతో ప్రవర్తించిన విధానం.. ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఏరకంగా కూడా అది ప్రేమలాగా అనిపించదు. సినిమాలో వీరి ప్రేమ కథ సీన్స్ మాత్రం ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇంకా కొంచెం జాగ్రత్తగా రాసుకుని ఉంటే బాగుండేదేమో.

    ‘‘ఇస్మార్ట్ శంకర్ ’’లో హీరో హీరోయిన్ ను బూతులు తిడతాడు. అమ్మాయి వెనకాల పడతాడు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతాడు. కానీ ఆ అమ్మాయి చివరకు హీరోనే ఇష్టపడుతుంది. ఇక రీసెంట్ గా వచ్చిన ‘‘యానిమల్’’ లో హీరోయిన్ ను హీరో చూసిన విధానం అసలు బాగాలేదని విమర్శలు కూడా వచ్చాయి.

    ఇలాంటి సీన్స్ ఇంకా.. అమ్మనాన్న తమిళ అమ్మాయి, రెమో, నేను లోకల్,  సర్కార్ వారి పాట.. ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో హిట్ మూవీలు ఉన్నాయి. మన హీరో ఏం చేసినా నడుస్తుంది.. విలన్ ఏది చేసినా మన హీరో వెళ్లి తన్నాలంతే. అదే మనం కోరుకుంటాం. అదే హీరోయిజం మరి.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    OTT Movies : ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమాలేంటో తెలుసా?

    OTT Movies : సినిమాలు ఇప్పుడు ఓటీటీలో తన ప్రభావం చూపిస్తున్నాయి....

    Animal Collections : రికార్డుల మోత! యానియల్ 19 రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే?

    Animal Collections : బోల్డ్ కంటెంట్ తో యూత్ ను అట్రాక్ట్...

    Sunny Deol : యానిమల్ పై సన్నీ డియోల్ సంచలన కామెంట్స్..

    Sunny Deol : రణ్‌బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందాన హీరోయిన్‌గా...