38.3 C
India
Thursday, May 2, 2024
More

    Babu Alliance With BJP : బాబు వ్యూహం పని చేస్తోందా..? బీజేపీతో పొత్తుకు విముఖత కరక్టెనా..?

    Date:

    Babu Alliance With BJP
    Babu Alliance With BJP

    Babu Alliance With BJP : టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం ఏంటి.. ఏపీలో అధికార వైసీపీని ఢీకొట్టేందుకు ఆయన ఒక పక్కా వ్యూహం తో ముందుకెళ్తున్నారని శ్రేణులు చెబుతున్నాయి. ఎన్నికలకు మరో నాలుగు నెలల గడవు మాత్రమే మిగిలి ఉంది. మార్చి తర్వాత ఏ క్షణమైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.

    ఇక ఈసారి టీడీపీని అధికారంలోకి తేవాలని అధినేత చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో కూడా ఈ మూఢ్ కనిపిస్తున్నది. టీడీపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ఆయన పదే పదే ప్రజలకు వివరిస్తు్న్నారు. అయితే ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండడంతో, అధికార వైసీపీ ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుపై వివిధ కేసులు నమోదు చేసింది.

    అయితే చంద్రబాబు మాత్రం వచ్చే ఎన్నికల్లో జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తుతో వెళ్లాలని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇందులోకి బీజేపీ వస్తే కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుంది. చంద్రబాబు వ్యూహం ప్రకారమే ముందుకెళ్తున్నారని, ఆయన పక్కా జనసేనతోనే పొత్తుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నది. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులను చూసి బీజేపీ కూడా వైసీపీ వైపు వెళ్లే పరిస్థితి లేదు. ఈ క్రమంలో బీజేపీనే టీడీపీ వైపు వచ్చేలా చేసుకోవాలని ఆయన చూస్తున్నారు.

    లేదంటే బీజేపీకి చాన్స్ ఇస్తే టీడీపీని పూర్తిగా తనవైపు తిప్పుకునే చాన్స్ ఉంటుంది. ఈ క్రమంలో ఆయన బీజేపీని నమ్మే పరిస్థితి లేదు. అందుకే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీకి ఆయన సమదూరం పాటిస్తున్నారు.  అయితే చంద్రబాబు మాత్రం తన పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తున్నది. చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ తానే ఇబ్బంది లో పడుతున్నారు.  ప్రజల్లో ఇప్పటికే టీడీపీ పై పెద్ద ఎత్తున సానుభూతి వచ్చింది.

    రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలే ఇందుకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఇక దీనిని క్యాస్ చేసుకోకుండా 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఎందుకు వదులుకుంటారు. ఏపీలో ఇప్పుడు జరుగుతున్న అన్ని పరిణామాలు చంద్రబాబుకు కలిసి వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఆయన వ్యూహం పనిచేస్తే ఇక టీడీపీ కి తిరుగులేదనే అభిప్రాయం వినిపిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    Population : ఆ దేశంలో రోజు రోజుకు తగ్గుతున్న జనాభా.. 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీ .. కారణం ఇదే!

    Population : రాను రాను జనాభా తగ్గుతుండడంతో జపాన్ తల పట్టుకుంటోంది....

    Bharatiyadu 2 : జూన్ లో ‘భారతీయుడు 2’..

    Bharatiyadu 2 :విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    Vangaveeti Radha : వంగవీటి రాధాకు ఏమైంది? ఎందుకీ దుస్థితి?

    Vangaveeti Radha : విజయవాడ అంటేనే వంగవీటి రాధా గుర్తుకు వస్తారు....

    Who Is Jagan : ఇంతకీ జగన్ ఎవరు? అర్జునుడా..? అభిమన్యుడా..? కుంభకర్ణుడా..?

    Who is Jagan : ఏపీ రాజకీయాల్లోని నాయకుల తీరు ఇతిహాసాల్లోని...

    Pedakurapadu : పెదకూరపాడులో వైసీపీకి షాక్.. 70 కుటుంబాలు టీడీపీలోకి..! 

    Pedakurapadu : పెదకూరపాడు నియోజకవర్గo  లో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి...