Sharmila : వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కన్ఫ్యూజన్ లో పడ్డారా ? ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారా ? అనే అనుమానాలు తలెత్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రశ్నలు తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. పార్టీ స్థాపించిన కొత్తలో ఒంటరిగా బరిలోకి దిగుతామని, వైఎస్ఆర్ అభిమానులు తమకు మద్దతు ఇస్తారని చెప్పుకొచ్చారు షర్మిల. తన దూకుడును కూడా ప్రదర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇప్పటికీ తెలంగాణలో అధికార పార్టీతో పాటు సీఎం, మంత్రులను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం లేదా ఆ పార్టీతో పొత్తు కుదుర్చునేందుకు సిద్ధమయ్యారని మీడియాతో పాటు పొలికటల్ సర్కిళ్లలోనూ జోరుగా ప్రచారం సాగింది. అయితే షర్మిల ఈ వార్తలపై స్పందించలేదు.
పాదయాత్రలో దూకుడు
అయితే షర్మిల తండ్రి వైఎస్సార్, సోదరుడు జగన్ మాదిరిగానే తెలంగాణలో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో అధికార పార్టీపై దూకుడుగా వ్యవహరించారు. దీంతో ఆమె పాదయాత్రకు మంచి స్పందన వచ్చింది. అధికార పార్టీ ఆమె పాదయాత్రకు సృష్టించింది అంటే ఆమెకు ప్రజల నుంచి వస్తున్న ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. షర్మిల తన పాదయాత్రలో జిల్లాల వారీగా, అక్కడి ఎమ్మెల్యేల వారీగా ప్రశ్నలు సంధించారు. ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ కూడా అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసేలా విమర్శలు ఎక్కుపెట్టలేదు. పూర్తి రాజకీయ చతురతను ప్రదర్శించి ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేశారు. అధికార పార్టీ సృష్టించిన అడ్డంకులతో షర్మిల తన పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నది.
కర్ణాటక ఎన్నికలతో మారిన సీన్
కర్ణాటక ఎన్నికల తర్వాత షర్మిల తన దూకుడును తగ్గించింది. కర్ణాటక లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, షర్మిల అక్కడి డిప్యూటీ సీఎంను కలవడంతో పలు ఊహాగానాలు వచ్చాయి. త్వరలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ విలీనం చేయబోతున్నదని, కుదరని పక్షంలో పొత్తుకు మొగ్గు చూపుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతున్నది. అయితే షర్మిల వీటిని ఖండించడం లేదు. అలాగని సానుకూలత కూడా వ్యక్తం చేయడం లేదు.
పార్టీ నిర్వహణ కష్టమవుతున్నదా.?
అయితే షర్మిల పార్టీలో చెప్పుకోదగ్గ నేతలు లేరు. అన్నింటికీ ఆమె ముందు నిలబడాల్సిన పరిస్థితి. ఆర్థిక భారం కూడా ఎక్కువవుతున్నట్లు తెలుస్తున్నది. ఎన్నికల వరకు అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి వలసలు వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఎటు వైపు అడుగు వేయాలో షర్మిల తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తున్నది.
కాంగ్రెస్ వైపేనా
మారిన రాజకీయ పరిస్థితులతో షర్మిల కాంగ్రెస్ వైపు
చూస్తున్నట్లు సమాచారం. షర్మిల బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని పార్టీ ఏర్పాటు చేసిందని మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ బీజేపీకి తెలంగాణలో షర్మిలను ముందు పెట్టుకొని రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బీజేపీతో కలిసేందుకు ముందుకు సాగుదామనుకుంటున్నా మోదీ, కేసీఆర్ దోస్తీ అని దేశమంతా ప్రచారం సాగుతున్నది. ఈ పరిస్థితుల్లో బీజేపీ షర్మిల పార్టీతో జత కడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మొన్నటి వరకు స్నేహం కోసం చేయి చాచిన కాంగ్రెస్ కు తెలంగాణలో షర్మిల మద్దతు అవసరం లేదు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ తన బలం పుంజుకుంటున్నది. షర్మిల మనసు చంపుకొని కాంగ్రెస్ తో జత కట్టినా ఆమెను ఒరిగేది ఏమీ లేదు. పార్టీ పెట్టినప్పటి నుంచి తన రాజకీయ జీవితం అంతా తెలంగాణలోనే ఆంధ్రాతో నాకు సంబంధం లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి తన రాజకీయ జీవితాన్ని ఆంధ్రాకు మార్చే అవకాశాలను చేజేతులా దెబ్బతీసుకున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో షర్మిల ఎటు వెళ్లినా చేతులు కాల్చుకోవడమే తప్ప మరోటి ఆమెకు ఒనగూరే ప్రయోజనం కనిపించడం లేదు.