
Jamshatji : ఫిలాంథరపిస్ట్ బిలియనీర్స్ ఎంతో మంది ఉన్నారు. బిల్ గేట్స్, వారన్ బఫెట్ ఇలా చాలా మంది ఉన్నారు. వీరందరూ వారున్నంత వరకూ (ప్రస్తుం బతికే న్నారు.) సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. వీరందరి స్టయిల్ ఒకటి అయితే ఇందులో అతి గొప్ప వ్యక్తి జమ్‌షట్‌జీ టాటా అనడంలో ఎటువంటి సందేహం లేదు. భారతదేశానికి ఇప్పటికీ టాటా కంపెనీ సేవలు అందిస్తూ ప్రపంచంలోనే గొప్ప దేశభక్తి చాటుకున్న కంపెనీగా కీర్తి దక్కించుకుంది. ద్రవ్యోల్బనం పడిపోతున్న సమయంలోనూ టాటా గ్రూప్ తన సేవా కార్యక్రమాలను నిరాటంకంగా నిర్వహించింది అంటే సేవే పరమావధిగా టాటా గ్రూప్స్ నడుస్తుంది.
1904లో జమ్‌షట్‌జీ మరణం అనంతరం టాటా సన్స్ మార్కెట్లోకి ప్రవేశించింది. విస్తృతంగా తమ కంపెనీలను స్థాపించుకుంటూ వెళ్లింది. ఆ తర్వాత అన్నీ కంపెనీలను ఒక్కతాటిపైకి తసుకువచ్చింది. అంతే ఇక టాటా కంపెనీ వరల్డ్ ఎకానమీలో 66 శాతం ఈక్విటీ సొంతం చేసుకుంది. ఈ డబ్బును కూడా కంపెనీ చాలా వరకూ సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తుంది. వైద్యం, విద్య, సంస్కృతిక కార్యక్రమాలు, ఆర్ట్ ఇలా చాలా సేవా కార్యక్రమాలతో భారతదేశంలోని ప్రతీ పౌరుడి మదిలో ఉండిపోతుంది.
టాటా తర్వాత ఆయన కుమారులు, ఆ తర్వాత ట్రస్టీ ఇలా టాటా తన సేవలను ఇప్పటికీ కొనసాగిస్తూనే వస్తుంది. ఇప్పుడు కంపెనీ సీఈవో రతన్ టాటా కూడా సేవాల కార్యక్రమాలకు ఎటువంటి విఘాతం కల్పించకుండా కొనసాగిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తాము అనుకున్న సేవను మాత్రం వీడడం లేదు. కరోనా సమయంలో కూడా టాటా సేవలు దేశంలోని ప్రతీ పౌరుడి మదిలో తుది శ్వాస వరకూ గుర్తిండి పోతాయి. కరోనా విజృంభించడంతో తన దేశంలో కోసం అని ఒకే సారి రూ. 1500 కోట్లను ప్రధానమంత్రి ఖాతాకు కంపెనీ ఇచ్చిందంటే దేశంపై ఆ కంపెనీ చూపే భక్తి ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు తమ కంపెనీలో ఆక్సిజన్ ప్లాంట్లను పర్తి దేశానికి ఉపయోగించేలా ఆర్డర్ వేశారు రతన్ టాటా.
ప్రపంచంలోని ఎంతో మంది కుభేరులు ఉన్నా వారందరూ జమ్ షడ్ జీ టాటా, ఆయన కుమారుల ముందు తక్కువని చెప్పడంలో ఎటువంది సందేహం లేదు. ఇతర దేశాల్లోని బిలియనీర్స్ వారి వారి సేవలను చేస్తున్న ఒక దేశం కోసం మిలియన్ డాలర్ల కంపెనీలను కొనసాగిస్తూ అందులో వచ్చిన డబ్బులను కూడా అదే దేశం కోసం వినియోగించడం నిజంగా అద్భుతమనే చెప్పాలి.