
Jupally and Ponguleti : జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక కథ చివరి దశకు వచ్చింది. ఈ రోజు (జూన్ 26)న ఢిల్లీకి వెళ్తున్న ఇద్దరు నేతలు రాహుల్ గాంధీ ముందు తమ డిమాండ్లను పెట్టనున్నారు. వీటికి రాహుల్ ఒప్పుకుంటే దాదాపు వీరి చేరిక ఖాయం అవుతుంది.
ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలలో వీరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పొగులేటి ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుఫున పోటీ చేసి గెలిచి తర్వాత బీఆర్ఎస్ బాట పట్టారు. కొంత కాలంలో పార్టీ విషయంలో వీరు కొంత వ్యతిరేకతతో ఉన్నారు. దీంతో అధినేత కేసీఆర్ ఈ ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వీరి సస్పెండ్ తో ఖమ్మంలో తీవ్ర రాజకీయ సంక్షోభం ఎదురైంది. కేసీఆర్ పై ఫైట్ చేసి తీరుతామని ఇద్దరు నేతలు కొత కాలంగా చెప్పుకుంటూ వస్తున్నారు.
కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ సరైన పార్టీ అని గతంలో భావించి చేరికల కమిటీ సభ్యుడు ఈటల రాజేందర్ తో టచ్ లో ఉన్నారు. దాదాపు చేరడం ఖాయం అనుకునే సమయంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దీంతో ఇద్దరు నేతలు యూ టర్న్ తీసుకున్నారు. సౌత్ స్టేట్ కర్ణాటక హస్తగతం కావడంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఊపు పెరిగింది. ఈ నేపథ్యంలో కొంత కాలంగా ఆ పార్టీతో టచ్ లోకి వెళ్లారు ఈ ఇద్దరు నేతలు. అయితే వారు కొన్ని డిమండ్లను రాహుల్ ముందు ఉంచబోతున్నారు. వీటిని ఆయన ఓకే చెప్తే చేరడం ఖాయమంగా కనిపిస్తుంది.
కాంగ్రెస్ కు లాభమా..? నష్టమా..
పొంగులేటి, జూపల్లి చేరికతో కాంగ్రెస్ కు ఖచ్చితంగా లాభం జరుగుతుంది. ఇద్దరూ కూడా చాలా ప్రభావవంతమైన నేతలు. జూపల్లి కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు ఐదు సార్లు గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. ఇక పొంగులేటి విషయానికి వస్తే ఆయన కూడా కాంగ్రెస్ లో వివిధ హోదాల్లో పని చేశారు. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి వైసీపీ తరుఫున పోటీ చేసిన పొగులేటి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఇద్దరు నేతలకు వారి వారి సెగ్మెంట్లలో భారీ ఫాలోయింగ్ ఉంది.
వీరిద్దరే దాదాపు ఖమ్మం జిల్లాలను మొత్తం ప్రభావితం చేస్తారు. సొంతంగా గెలవకున్నా ఇద్దరు నేతలను తమ పార్టీలో చేర్చుకున్న బీఆర్ఎస్ తన పార్టీ కేడర్ ను పెంచుకునేందుకు పావులు కదిపింది. కానీ వారి ఆటలు సాగకపోవడంతో ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరించింది. వీరి చేరికతో ఖమ్మంలో కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు మరింత పెరిగే అవకాశం ఉంది. అక్కడ ఇప్పటి వరకు బీజేపీకి గానీ, బీఆర్ఎస్ కు గానీ కేడర్ లేదు. వీరి చేరికతో కంగ్రెస్ కు మరింత ఊపు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.