39.3 C
India
Friday, April 26, 2024
More

    women rights : పుట్టింటి ఆస్తిలో ఆడపిల్లలకు హక్కుపై చట్టాలేం చెబుతున్నాయి..?

    Date:

    women rights
    women rights

    Women rights : తండ్రి సంపాదించిన లేకుంటే తాత సంపాదించిన ఆస్తుల్లో ఆడపిల్లలకు హక్కుపై చాలా ఏండ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. కొడుకు, మనుమలుకు ఉన్న పూర్తిస్థాయి హక్కు ఆడపిల్లలకు ఉండడం లేదనేది అందరికీ తెలిసిన నిజమే. మరి అసలు అడపిల్లకు పెండ్లయితే ఈ హక్కు ఉండదా..? మరి మన చట్టాలు ఏం చెబుతున్నాయి.

    అయితే ఆడపిల్లల సమయంలో అత్తింటింకి పంపే సమయంలో కట్నకానుకలను ప్రస్తుతం అన్ని కుటుంబాలు అందజేస్తూ ఉంటాయి. నగదు రూపంలో, బంగారం రూపంలో ఆడపిల్లకు ఈ కానుకలు అత్తింటికి చేరుతాయి. ఇక పుట్టింటి ఆస్తుల పంపకాల్లో మాత్రం వారసులకే అంతా చేస్తూ ఉంటారు. కొందరు మాత్రమే ఆడబిడ్డకు ఉడత భక్తిగా సాయమో లేకుంటే కొందరు ఆదర్శవంతులు వాటానో ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చట్టాల్లో మాత్రం పుట్టింటిలో మగవారితో పాటు ఆడపిల్లలకూ సమాన హక్కు ఉంటుందని చెబుతున్నాయి.

    చాలా కుటుంబాల్లో నేటికీ ఈ సమస్య ఉంటుంది. ఆడపిల్లలకు హక్కు కల్పించేందుకు చాలా వరకు మగ సంతానం ముందుకు రారు. ఇలాంటి సందర్భంలోనే ఆడపిల్లలకు చట్టాలు చుట్టాలవుతాయి. కోర్టును ఆశ్రయించడం ద్వారా ఆడపిల్లలు కూడా సమాన హక్కు పొందే అవకాశం ఉంటుంది. 2005 ఎమండమెంట్ చట్టం ప్రకారం.. పార్టిషియన్ సూట్ వేయడం ద్వారా పురుషులతో సమానంగా ఆడపిల్లలు హక్కు పొందవచ్చు.  ఒక ఇంట్లో మగ, ఆడ సమానమేనని, పెండ్లయి అత్తవారింటికి వెళ్లినంత మాత్రాన ఆడబిడ్డకు హక్కు లేదనడం భావ్యం కాదని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

    న్యాయస్థానాలు కూడా దీనితో ఏకీభవిస్తున్నాయి. పలు కేసుల్లో తీర్పులు కూడా ఇందుకు అనుకూలంగానే వచ్చాయి. అయినా చాలా కుటుంబాల్లో ఈ వివాదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ముందునుంచే ఆడపిల్ల ఆ ఇంటిలో భాగమేననే భావన అందరిలో కల్పిస్తేనే ఇక్కడ సమస్యకు పరిష్కారం దక్కుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆడపిల్ల, మగ పిల్లాడు అనే బేధం తో పెంచితే పరిస్థితి ఇలాగే ఉంటుందని పేర్కొంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Varun Tej Campaign : రేపు పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

    Varun Tej Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం...

    MLA Harish Rao : స్పీకర్ కు ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖ

    MLA Harish Rao : ఈరోజు శాసనసభ స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్...

    Nerella : నేరెళ్లలో మండే సూర్యుడు..

    Nerella : ఎండాకాలం నేపథ్యంలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో జగిత్యాల...

    One project : ఒక్క ప్రాజెక్టుకు తట్టెడు మట్టి తీశారా?

    One project : ‘‘ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి ప్రాజెక్టులు కట్టిస్తాం.. ప్రతి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Andhra Pradesh : ఓటు హక్కుతో ఆస్తి హక్కు కోసం ఆంధ్రుల ఆఖరి పోరాటం!

    Andhra Pradesh : నది- నాగలి నేర్పిన నాగరిక మట్టి మనుషులం...