ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ కు చెందిన సరోజా అల్లూరి తాజాగా అమెరికాలో జరిగిన పోటీలలో ” మిసెస్ ఆసియా యూఎస్ఏ ” గా కిరీటం కైవసం చేసుకుంది. ఇటీవల కాలిఫోర్నియాలో మిసెస్ ఆసియా యూఎస్ఏ పోటీలు జరిగాయి. కాగా ఈ పోటీలలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. అందులో మిసెస్ ఆసియా యూఎస్ఏ గా నిలిచింది సరోజా అల్లూరి.
ఏపీకి చెందిన సరోజా అమెరికాలో స్థిరపడింది. భర్త ఇద్దరు పిల్లలతో సంతోషంగా సాగిపోతోంది జీవితం. అయితే సాటి మనిషికి సహాయపడాలి అనే సుగుణంతో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది సరోజ. అలాగే మిసెస్ ఆసియా యూఎస్ఏ పోటీల గురించి తెలుసుకున్న సరోజ ఆ పోటీలలో పాల్గొనడమే కాకుండా టైటిల్ కూడా కైవసం చేసుకోవడంతో సరోజ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.