social media సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా పడుతోంది. పని లేని వాడికి అదే పనిగా ఉంటోంది. నిత్యం ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ ఖాతాల ద్వారా ఆకర్షణకు గురవుతున్నారు. పెళ్లయినా సామాజిక మాధ్యమాల ప్రభావంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అయినా పట్టించుకోవడం లేదు. ఫేస్ బుక్ లో పరిచయాలు పెంచుకుని సంసారమున్నా నిర్లక్ష్యంతో వెళ్లిపోతున్నారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో అంజు (34), అర్వింద్ దంపతులు నివసిస్తున్నారు. వారికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. ఫేస్ బుక్ లో ఆమెకు 2019లో పాకిస్తాన్ కు చెందిన నస్రుల్లా అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో వీరి మధ్య స్నేహం పెరిగింది. ఔషధ రంగంలో పనిచేస్తున్న అతడిని కలుసుకోవడానికి పాకిస్తాన్ వెళ్లింది.
జైపూర్ నుంచి పాక్ లోని ఖైబర్ పఖ్తుంభ్వాకు వెళ్లింది. అక్కడి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వీసాతో పాటు అన్ని సక్రమంగా ఉండటంతో వదిలిపెట్టారు. అయితే వారి మధ్య ఉన్నది ప్రేమ కాదని కేవలం స్నేహం మాత్రమే అని నస్రుల్లా చెబుతున్నాడు. ఆమె మా ఇంటి కుటుంబ సభ్యులతో ఉంటోంది. తనకు నాకు మధ్య ఎలాంటి ప్రేమ లేదని అంటున్నాడు.
మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నాడు. కేవలం మా మధ్య ఉన్నది స్నేహం కావడంతో అపార్థాలు అవసరం లేదని చెబుతున్నాడు. అలా వెళ్లిన ఆమె సంసారం ఏం కావాలని విమర్శలు వస్తున్నాయి. ఫేస్ బుక్ పరిచయానికి ఇంత తెగించాలా? మొగుడిని వదిలేసి వెళ్లిన ఆమె భవిష్యత్ ఏమిటనే సందేహాలు వస్తున్నాయి.