32.3 C
India
Friday, May 10, 2024
More

    Dharman Shanmugaratnam : సింగపూర్ అధ్యక్షుడిగా మన భారతీయుడు ధర్మన్ షణ్ముగరత్నం?

    Date:

    Our Indian Dharman Shanmugaratnam as President of Singapore?
    Our Indian Dharman Shanmugaratnam as President of Singapore?

    Dharman Shanmugaratnam :

    సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ధర్మన్ షణ్ముగరత్నం (66) విజయం సాధించి రికార్డు కొట్టారు. చైనా సంతతికి చెందిన ఇద్దరిని ఓడించి ధర్మన్ విజయం సాధించడం గమనార్హం. సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి విజయం సాధించడం సరికొత్త రికార్డే. 2011 తరువాత దేశంలో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఇద్దరు చైనా సంతతి వ్యక్తులను ఓడించి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది.

    శుక్రవారం జరిగిన ఎన్నికల్లో షణ్ముగరత్నంకు 70.4 శాతం ఓట్లు రాగా ప్రత్యర్థులైన ఎంగ్ కోక్ సోంగ్, టాన్ కిన్ లియాన్ లకు వరుసగా 15.7 శాతం, 13.88 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 27 లక్షల మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ధర్మన్ కు సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ అభినందనలు తెలిపారు. సింగపూర్ ప్రజల నిర్ణయాత్మక ఓట్లు సాధించడంలో ధర్మన్ ప్రజల మనసులు గెలుచుకున్నారని కొనియాడారు.

    ప్రస్తుత అధ్యక్షురాలు హలీమా యాకూబ్ పదవీ కాలం సెప్టెంబర్ 13తో ముగుస్తుంది. సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో షణ్ముగరత్నం గెలవడం సంతోషంగా ఉందన్నారు. ఆర్థిక వేత్త అయిన షణ్ముగరత్నం 2001లో పీపుల్స్ యాక్షన్ పార్టీ లో చేరారు. పలు పదవులు నిర్వహించారు. 2019 వరకు ఉప ప్రధానిగా సేవలందించారు. జులై నుంచి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజల్లో నమ్మకం పెంచేందుకు పాటుపడ్డారు. అందుకే దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

    గతంలో తమిళనాడుకు చెందిన సెల్లప్పన్ రామనాథన్ సింగపూర్ అధ్యక్షుడిగా ఎక్కువ కాలం పనిచేసిన వాడిగా గుర్తింపు పొందారు. 1981-85 మధ్య మలయాళీ అయిన చెంగర వాటిల్ దేవన్ నాయర్ కూడా అధ్యక్షుడిగా పనిచేశారు. ఇలా మన భారత సంతతికి చెందిన వారు సింగపూర్ లో అధ్యక్ష పీఠం ఎక్కి రికార్డులు నెలకొల్పారు. ఇప్పుడు షణ్ముగరత్నం కూడా వారి దారిలోనే నడుస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Chandrababu : ఓటేసిన వారిని జగన్ కాటేస్తాడు: చంద్రబాబు

    Chandrababu : ఓటేసిన వారిని కాటేసే రకం జగన్ దని నారా...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chintala Raju : అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో చింతల రాజు

    Chintala Raju : తెలుగువారు విదేశాల్లో సత్తా చాటుతున్నారు. ప్రవాస భారతీయుల సత్తాతో...

    Temples : భారతదేశంలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాలు!

    Temples మనదేశంలో భక్తిభావం మెండుగా ఉంటుంది. దేవుళ్లను కొలవడం మన సంప్రదాయం....

    social media : అంజును పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదన్న నస్రుల్లా

    social media సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా పడుతోంది. పని లేని...

    Tamannaah Enjoying Her Time In Singapore