39.4 C
India
Monday, April 29, 2024
More

    Nethone Nenu Movie Review : ‘నీతోనే నేను’ రివ్యూ అండ్ రేటింగ్!

    Date:

    Nethone Nenu Movie Review
    Nethone Nenu Movie Review

    Nethone Nenu Movie Review : సినీ పరిశ్రమలో ప్రతీ వారం ఎన్నో సినిమాలు అలరిస్తూనే ఉంటాయి.. ప్రతీ శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి.. వాటిలో కొన్ని విజయం సాదిస్తుంటే మరికొన్ని పరాజయం అవుతుంటాయి.. అయితే ఈ వారం కూడా ఎప్పటిలాగానే కొన్ని సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి.. మరి వాటిల్లో నీతోనే నేను సినిమా ఒకటి.. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

    మనిషికి ఏది ఉన్న లేకపోయినా విద్యతో వచ్చే గుర్తింపు, మర్యాద ఎక్కడ ఉండదు అనే ఒక మంచి సబ్జెక్ట్ తో తెరకెక్కింది నీతోనే నేను.. ఇలాంటి కథతో సినిమాలు చాలా తక్కువుగా వస్తుంటాయి.. టీచర్ గా పని చేసి తనకున్న అనుభవాలతో ఎం సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.. శ్రీ మామిడి ఎంటర్టైన్మెంట్స్ పై ఈ సినిమాను నిర్మించగా అంజి రామ్ తెరకెక్కించారు. ఈ రోజు రిలీజ్ అయినా ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

    రామ్ (వికాస్ వసిష్ఠ) ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నారు. తన స్కూల్ లో ఉన్న పిల్లలు చక్కగా చదువుకుని మంచి పొజిషన్ లోకి రావాలని తాపత్రయ పడేవాడు. ఇతడిని చూసి చాలా మంది ఈర్ష్య పడుతుండేవారు..

    ఇక ఇతడిని అయేషా (కుషిత కళ్లపు) ఇష్టపడుతుంది.. ఈమె పీటీ టీచర్ గా పని చేస్తుంది. రామ్ కు ప్రపోజ్ చేయగా ఆల్రెడీ ఇతడి జీవితంలో సీత ఉందని తెలుసుకుంది.. మరి ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే నేపథ్యంలో కథ సాగుతుంది.

    ఇక వికాస్ ఉపాధ్యాయుడి పాత్రలో మెప్పిస్తాడు.. తన నటనలో మెచ్యూరిటీ కనిపిస్తుంది.. కుషిత తెరపై అందంగా కనిపిస్తుంది.. ఈమె ఎమోషనల్ పాత్రతో ఆకట్టుకుంటుంది. ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఎలా ఉందో కళ్ళకు కట్టినట్టు ఈ సినిమాలో చూపించారు. గవర్నమెంట్ స్కూల్స్ లో మంచి వసతులు కల్పిస్తే ఎంతో మంది గొప్పవారు అవ్వొచ్చు అనిపించేలా ఈ కథ తీరు నడిచింది.

    ప్రజలకు మంచి సందేశాన్ని ఇస్తూనే మరో వైపు మెసేజ్ తో మంచి లవ్ స్టోరీ కూడా చేయించారు. ఫస్టాఫ్ కాస్తంత సాగదీసినట్టు అనిపించింది. కానీ స్కూల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే ట్విస్టులు అందరిని ఆకట్టుకున్నాయి.. ఇక సెకండాఫ్ లో మరిన్ని ట్విస్టులతో ఆకట్టుకుంది.. ఆర్ఆర్, విజువల్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరు సినిమాకు న్యాయం చేసారు..

    రేటింగ్ : 2.5/5

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related