
New feature in WhatsApp : ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్ లతో వాట్సాప్ అప్ డేట్ అవుతూ వస్తోంది. యూజర్ల ప్రైవెసీకి మరింత భద్రత కల్పించేలా ఒక ఫీచర్ ను ఇటీవల తీసుకువచ్చింది యాజమాన్యం. అదే ‘లాక్‌చాట్’ ఈ ఫీచర్‌పై ఇటీవల మరింత లోతుగా పరిశోధన జరిపింది సంస్థ. అది భద్రతా పరంగా సరైందని ధృవీకరణ కావడంతో సోమవారం నైట్ వినియోగదారులకు దాని గురించి వివరించింది సంస్థ. ఈ విషయాలను మెటా సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ అధికారికంగా ప్రకటించారు. వాట్సాప్ లో మీ సంభాషణలు, చాట్ లను మరింత గోప్యంగా ఉంచుకోవచ్చు. పాస్ వర్డ్ రక్షణతో ఫోల్డర్ లో భద్రం చేసుకోవచ్చని ఆయన సూచించారు.
ఈ ఫీచర్ గురించి వివరించేందుకు వాట్సాప్ ఓ వీడియోను కూడా విడుదల చేసింది మెటా సంస్థ. దీని ద్వారా ప్రైవేట్ చాట్ లకు లాక్ విధించుకునే ఆప్షన్ తో పాటు వ్యక్తిగత చాట్ పై యూజర్లకు పూర్తి నియంత్రణ ఉంటుందని సంస్థ తెలిపింది. గోప్యత, భద్రత రెండూ పెరుగుతాయని చెప్పింది. ఒకసారి చాట్ లాక్ చేస్తే కేవలం యూజర్ ఫ్రింగర్ ప్రింట్ లేదా పిన్ నెంబర్ తోనే ఓపెన్ అవుతుంది. దీని ద్వారా ఇతరులు ఎవరూ మీ వాట్సాప్ చాట్ ను చూసే వీలు ఉండదు. ఒక వేళ ఎవరైనా ఆ చాట్ ను తెరిచేందుకు ప్రయత్నిస్తే చాట్ మొత్తం డిలీట్ చేస్తుంది.
మెటా రూపొందించిన ఈ ఫీచర్ పై బిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఎవరైనా ఉగ్రవాదులు ఈ ఫీచర్ ను ఉపయోగిస్తే భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తుతాయని పలువురు నెటిజన్లు అంటున్నారు. ఒక వేళ ఇద్దరు ఉగ్రవాదులు దీన్ని యూజ్ చేస్తే ఏదైనా ఏజెన్సీ దీన్ని బహిర్గతం చేయలేకపోతుందని దీని ద్వారా మరింత అభద్రత ఏర్పడుతుందని వాపోతున్నారు.