34 C
India
Friday, April 26, 2024
More

    NRI Jayaram : అమెరికాలో 60 సిటీల్లో ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాలు: ఎన్ఆర్ఐ జయరాం

    Date:

    NRI Jayaram
    NRI Jayaram

    NRI Jayaram: ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాల సందర్భంగా మహానాడు కార్యక్రమం రాజమండ్రిలో ఘనంగా ప్రారంభమైంది.  ఈ కార్యక్రమానికి ఎంతో మంది అతిథులు తరలివచ్చారు.  అయితే ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ జయరాం మాట్లాడుతూ రాజమండ్రిలోనే కాదు అమెరికాలో 60 సిటీల్లో ఇదే సమయంలో అన్నగారి శతజయంత్యుత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. న్యూయార్క్ లోని టైం స్క్వేర్లో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఎన్టీఆర్ ప్రతిబింబం కనిపించేలా ఏర్పాటు చేశాం. ఇది వీకెండ్ కావడంతో చాలా మంది తెలుగు వాళ్లు అక్కడికి చేరుకుంటున్నారు. మా అందరికీ తెలుగుదేశం, అన్నగారు, మాతృభూమి మీద ఉన్న అభిమానంతోనే ఇక్కడికి వచ్చాం అని తెలిపారు.

    40 ఏండ్లుగా అమెరికాలో ఉన్నా తెలుగుదేశం పిలుపునిచ్చే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి కూడా అమెరికా నుంచి 100 మంది ఎన్ఆర్ఐలు విచ్చేశారు. క్రియాశీలక రాజకీయాల్లో కూడా కొంతమంది ఎన్ఆర్ఐలు ఇక్కడ ఉన్నారు.  మేం ఎక్కడ పనిచేస్తున్నా మేం పుట్టిన గడ్డ ఏపీ బాగుండాలని ఆలోచిస్తుంటాం.

    నారా చంద్రబాబునాయుడిని మళ్లీ సీఎంగా చేయాలని, మేమంతా కంకణబద్దులమైం ఉన్నాం. ఇదంతా ఆరంభం మాత్రమేనని, ఎన్ఆర్ఐలం తెలుగు దేశానికి అండగా ఉంటామని తెలిపారు. ఎన్ఆర్ఐలు మోహన్ మన్నవకృష్ణ, రవి మందలపు, పైల ప్రసాద్, కృష్ణ గంప, సుధాకర్ కంచర్ల, సురేశ్ కాకర్ల, మల్లిక్ మెదరమెట్ల, లాంటి ఎన్ ఆర్ఐలు తెలుగు దేశం, ఏపీ మీద గౌరవం, అభిమానంతో ఇక్కడికి వచ్చాం. నారా చంద్ర బాబునాయుడి గారికి మాత్రమే ఏపీని బాగు చేసే   సత్తా ఉందని నమ్ముతున్నాం.  ఆయన గెలుపునకు 2024 మేమంతా కలిసికట్టుగా సహకరిస్తాం. రాష్ర్ట ప్రయోజనాల రీత్యా టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది.

    Share post:

    More like this
    Related

    BRS-Congress : అప్పుడు బిఆర్ఎస్ వేస్తె.. ఇప్పుడు కాంగ్రెస్ వేసింది

    BRS-Congress : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ...

    Pawan Kalyan : అధికారం వద్దు… సినిమానే ముద్దంటున్న పవన్ కళ్యాణ్

    Pawan Kalyan : భారతీయ జనతా పార్టీ,తెలుగు దేశం పార్టీ, జనసేన...

    Weather Report : 28 నుంచి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు

    Weather Report : తెలంగాణలో ఈ నెల 28 నుంచి వర్షాలు...

    Canada : కెనడాలో ఉద్యోగాల్లేవ్ రాకండి..సీనియర్ సిటిజన్ వేడుకోలు.. వీడియో వైరల్

    Canada : భారత్ లో గ్రాడ్యుయేట్ అయిన ప్రతీ ఒక్కరి కల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    America : అమెరికాలో 15 సురక్షిత నగరాలు, 15 ప్రమాదకర నగరాలు.. ఏవంటే..?

    America : అమెరికాలో ఈ మధ్య కాల్పుల ఘటనలు తరుచూ వినిపిస్తున్నాయి....

    NTR cover page : ఇంగ్లిష్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా..?!

    NTR cover page : యుగపురుషుడు నందమూరి తారక రామారావు గురించి...

    Poor to Rich : ‘పూర్ టు రిచ్’ ఏపీలో సాధ్యమేనా.. చంద్రబాబు చేయగలడా..?

    Poor to Rich : ఏపీలో ఎన్నికలకు మరో పది నెలల...

    NTR 100th Jayanthi : దైవం మానవరూపంలో..తెలుగు జనోద్ధారకుడు ఎన్టీఆర్..

    NTR 100th Jayanthi : నందమూరి తారకరామారావు.. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా,...