ఏపీలోని గోదావరి జిల్లాల్లో జనసేన చీఫ్, సినీ హీరో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలైంది. అన్నవరంలో ప్రారంభమైన యాత్ర పిఠాపురం మీదుగా సాగుతోంది. ఆయా సభల్లో వైసీపీ పై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. మరోవైపు జనసేనాని రాకకోసం అశేష జనవాహిని ఎదురు చూస్తున్నది. ఆయన వెళ్లే రూట్ వెంట యువత బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా చేస్తు్న్న కొన్ని స్లోగన్ లు పేలుతున్నాయి. పిఠాపురం సభ సందర్భంగా చేసిన స్లోగన్ లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.
ఏపీలో జనసేనాని పర్యటన అశేష జనసందోహం మధ్యసాగుతున్నది. అయితే పిఠాపురం సభలో అభిమానులు ఒక్కసారిగా అరటి పండు తొక్క.. జగన్ అన్న బొక్క అంటూ నినదించారు. పిఠాపురం సభలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు కనీవినీ ఎరగని ఘన స్వాగతం లభించింది. ఎండ మండుతున్నా, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటి ఉధృతంగా ఉన్నా జనసైన్యం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పవన్ సభకు జనం పోటెత్తుతూనే ఉన్నారు. సభలో పవన్ ప్రసంగానికి జనం చప్పట్లతో బదులిచ్చారు. పవన్ యాత్ర, ప్రసంగాలతో వైసీపీ నాయకుల గుండెల్లో దడ మొదలైందని జనసైనికులు చెబుతున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, దౌర్జన్యాలను ఏకరవు పెడుతూ పవన్ ప్రసంగిస్తుంటే ప్రజంతా పవన్ నినాదాలతో హోరెత్తించారు.
అయితే పవన్ కళ్యాణ్ ప్రసంగం ఒక్కసారిగా ఆయన అభిమానుల్లో పునకం తెప్పించింది. దీంతో ఉత్సాహం కట్టలు తెంచుకొని ప్రాంగణం మొత్తం ‘అరటి పండు తొక్క జగన్ అన్న బొక్క’ అని మార్మోగింది. దీంతో పవన్ కళ్యాణ్ ప్రసంగం కాసేపు ఆపి.. జనం వైపు చూస్తూ (నవ్వుతూ) నాకు ఏ ఒక్కరిని తిట్టడం ఇష్టం ఉండదు. ఆ మనిషిని కావాలని తిట్టించాలని లేదు, కానీ ఆయన చేసే పనులన్నీ అలా ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక కాకినాడ MLA ద్వారంపూడిపై ఒకరేంజ్లో ఫైర్ అయ్యారు. జనసేన కార్యకర్తలపై సదరు వ్యక్తి చేసిన దాడిని మర్చిపోలేదని, వాడి పేరు రేపు చెప్తా అంటూ ఎద్దేవా చేశారు. వాడు పిస్తోల్ తీసి బెదిరిస్తుంటారు అంట , ఆలాగే భీమాస్ రెడ్డి అంట వీళ్లందరి సంగతి ఎల్లుండి కాకినాడ సభలో చెప్తాను’ అంటూ పవన్ ప్రసంగించారు.
ఏదేమైనా పవన్ సభలో డైలాగులు పేలుతున్నాయి. ఇది ఆయన అభిమానులకు పండుగే. ఈ సారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీ లో అడుగుపెట్టాలని పవన్ భావిస్తున్నారు. సాధ్యమైతే ఆపుకోండి అంటూ వైసీపీకి సవాల్ విసిరారు. మరో వారం పాటు గోదావరి జిల్లాల్లో పవన్ పాదయాత్ర కొనసాగనుండగా, ఆయన మరెన్ని బాంబులు పేలుస్తారో అని ఆయా ఏరియాల ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుంది. మరి మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మజాకానా మరి. ఇక వైసీపీ నేతలపై ఎదురు దాడి తప్పదు. జనసైన్యం యుద్దానికి సై అంటున్నది. మరి అవతలివైపు నుంచి కూడా ఎలాంటి తూటాలు పేలుతాయో చూడాలి.
|
ReplyForward
|






