36 C
India
Monday, April 29, 2024
More

    Prema Vimanam Movie : ‘ప్రేమ విమానం’ రివ్యూ.. ఎలా ఉందంటే?

    Date:

    Prema Vimanam Movie
    Prema Vimanam Movie

    Prema Vimanam Movie : సినీ పరిశ్రమలో ప్రతీ వారం ఎన్నో సినిమాలు అలరిస్తూనే ఉంటాయి.. ప్రతీ శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి.. వాటిలో కొన్ని విజయం సాదిస్తుంటే మరికొన్ని పరాజయం అవుతుంటాయి.. అయితే ఈ వారం కూడా ఎప్పటిలాగానే కొన్ని సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి.. మరి వాటిల్లో సంగీత్ శోభన్ నటించిన ప్రేమ విమానం ఒకటి.. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

    యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ ఇటీవలే మ్యాడ్ సినిమాతో ఆకట్టుకున్నాడు. తన నటనతో ఎంతో మంది చేత ప్రశంసలు అందుకున్నాడు.. మరి ఈయన నటించిన ”ప్రేమ విమానం” సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది.. సంతోష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా అభిషేక్ నామా నిర్మించారు.

    ఇక ఈ సినిమాలో స్టార్ యాంకర్ అండ్ నటి అనసూయ కీలక రోల్ లో నటించింది.. ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కానుంది. ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన జీ5 లో ఈ రోజు నేరుగా ప్రేమ విమానం రిలీజ్ అయ్యింది. స్ట్రీమింగ్ నేటి నుండే స్టార్ట్ అయ్యింది. సంగీత్ శోభన్, శాన్వీ మేఘన జంటగా నటించిన ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

    ఈ సినిమా రెండు గ్రామాలలో 1990 బ్యాక్ డ్రాప్ లో జరిగిన కథ.. ఒక గ్రామంలో శాంతమ్మ (అనసూయ) ఆమె భర్త పిల్లలతో జీవిస్తూ ఉండేది.. అయితే ఈ కుటుంబం చిన్న గుడిసెలో జీవిస్తూ ఉండగా అప్పులతో వారి కుటుంబం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది.

    అయితే శాంతమ్మ చిన్న కొడుకు లచ్చుకు విమానం ఎక్కాలనే కోరిక ఉండడంతో ఆ కోరికను తండ్రికి చెబుతాడు.. పంట చేతికి వచ్చిన తర్వాత విమానం ఎక్కిస్తాను అని చెబుతాడు. కానీ ఆయన అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. శాంతమ్మ కూలి పనులు చేస్తూ పిల్లలను పెంచుతుంది.. మరో గ్రామంలో మని (సంగీత్ శోభన్) తండ్రితో కలిసి కిరానా కొట్టు నడుపుతుంటాడు.

    మణి ఆ గ్రామా సర్పంచ్ కూతురు జాభితా (శాన్వీ) ను ప్రేమించడంతో పెద్దవాళ్ళు ఒప్పుకోరని లేచిపోతారు.. మరి ఈ జంట ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది? శాంతమ్మ పిల్లలు విమానం ఎక్కాలనే కోరికతో ఏం చేసారు? అనేది మిగిలిన కథ.. చూడాలి మరి ఇది ఎలా ఆకట్టుకుంటుందో..

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related