26.3 C
India
Wednesday, September 16, 2026
More

    Allu Arjun’s Pushpa 2 : గోదావరి జిల్లాలో పుష్ప-2 షూటింగ్.. నదిలో ట్రక్కులతో పుష్పరాజ్..!

    Date:

    Pushpa2 Movie
    Pushpa2 Movie

    Pushpa2 : మన టాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”పుష్ప ది రూల్”.. ఈ సినిమాపై భారీ అంచనాలనే పెట్టుకున్నారు. పుష్ప ది రైజ్ సినిమా 2021లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యి ఎలాంటి కలెక్షన్స్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..

    అల్లు అర్జున్ ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఇమేజ్ సాదించుకున్నాడు. ఈయన నటన ముఖ్యంగా స్టైల్ అంటే అందరికి చాలా ఇష్టం.. ఇక పుష్ప సినిమాతో ఈయన క్రేజ్ అమాంతం పెరిగి పోయింది.. ఈ సినిమాకు సుకుమార్ ఇప్పుడు సీక్వెల్ ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.. ఈ ఏడాదినే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది..

    ఇక షూటింగ్ స్టార్ట్ అయ్యాక కొద్దీ గ్యాప్ తప్ప ఎక్కువ గ్యాప్ లేకుండా వరుస షెడ్యూల్స్ తో ఈ సినిమాను ఫాస్ట్ గా తెరకెక్కించే పనిలో సుక్కూ అండ్ టీమ్ ఉన్నారు. తాజాగా పుష్ప 2 షూటింగ్ గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం గోదావరి జిల్లాలలో షూటింగ్ జరుపు కుంటున్నట్టు తెలుస్తుంది. ఒక చిన్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

    అందులో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సీన్స్ ను తెరకెక్కిస్తూ టీమ్ కనిపించారు.. ఈ సినిమాను ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోనే తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. మరి ఈ సన్నివేశాలనే ప్రస్తుతం సుకుమార్ అండ్ టీమ్ తెరకెక్కిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుండి అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా గ్లింప్స్, ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగా వాటికీ యునానిమస్ రెస్పాన్స్ లభించింది. దీంతో ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

    ఇదిలా ఉండగా ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు టాక్.. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అలాగే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa2 Collections : 1000 కోట్లు దాటేసింది.. కల్కి రికార్డులు బ్రేక్..

    Pushpa2 Collections : డైరెక్టర్ సుకుమార్ రేంజ్ ఇప్పుడు పూర్తిగా పెరిగిపోయింది.....

    Pushpa 2 : అరె ఎంట్రా ఇది.. పుష్ప 2 పై దారుణమైన ట్రోలింగ్స్

    Pushpa 2 Trolls : పుష్ప 2 ట్రైలర్ నిజంగా మెస్మరైజింగ్...

    Pushpa 2 : పుష్ప2కు 50 రోజులు.. 300 కోట్ల ఓపెనింగ్ సాధ్యమేనా..?

    Pushpa 2 : ‘పుష్ప 2: ది రూల్’ విడుదలకు 50...