25.2 C
India
Tuesday, January 20, 2026
More

    Vijayendra Prasad : కేసీఆర్ గొప్పతనాన్ని బయటపెట్టిన రాజమౌళి తండ్రి

    Date:

    Vijayendra Prasad : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షాపరుడని ప్రముఖ రైటర్, బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల రచయిత విజయేంద్రప్రసాద్ అభివర్ణించారు. తెలంగాణలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని సందర్శించి తన భావాలు వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ నిర్మాణం ఎంతో బాగుందన్నారు. భవిష్యత్ తరాలకు దిక్సూచిలా నిర్మించారని మురిసిపోయారు. అతి తక్కువ కాలంలో తక్కువ బడ్జెట్ లో నిర్మించిన ఘనత ఆయనకే సొంతం.

    ఆధునికత శైలిలో నిర్మించిన అసెంబ్లీ భవన రూపురేఖలు చూసి ఆశ్చర్యపోయారు. కేసీఆర్ నిజంగా ప్రజల మనసు తెలుసుకున్ననాయకుడని కీర్తించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి తన చతురత చాటారు. సచివాలయ నిర్మాణం గొప్ప విషయమన్నారు. ఇంత తక్కువ సమయంలో ఇలాంటి నిర్మాణం చేపట్టడం అందరికి సాధ్యం కాదన్నారు.

    కేసీఆర్ ఆలోచనా విధానం బాగుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మనోభీష్టాల మేరకు పనులు చేయడం మంచిదేనన్నారు. ఇలా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించడం అందరికి సాధ్యం కాదు. ప్రజల అవసరాలు తీర్చడంలో సీఎం కేసీఆర్ ముందుంటున్నారు. అందుకే సీఎం విధానాలు ఇంతలా ఆకర్షిస్తున్నాయి.

    కేసీఆర్ గొప్ప దార్శనికుడు. ప్రజలకు ఏం కావాలో ఆలోచించి చేస్తున్నారు. అందుకే ఇంత మంచి పనులు చేస్తూ ప్రజల్లో మంచి స్థానం సంపాదించుకుంటున్నారు. ఆయన చేసిన పనులు చూస్తుంటే ముచ్చటేస్తోంది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి పనులు చేసి ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారని రాజేంద్రప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    pawan kalyan : పవన్ కల్యాణ్ విషయంలో విజయేంద్ర ప్రసాద్ చెప్పిందే జరిగిందా?

    pawan kalyan పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అందరికి ఎంతో...

    శ్రీరాముడి గెటప్ లో మహేష్ బాబు ఫ్యాన్ మేడ్ పోస్టర్ వైరల్

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీరాముడి గెటప్ లో ఉన్న...