pawan kalyan పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అందరికి ఎంతో పిచ్చి. ఆయన తెర మీద కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఊగిపోతుంటారు. కథలో వైవిధ్యమున్నా లేకపోయినా పవన్ కల్యాణ్ ను చూసేందుకైనా థియేటర్ కు వెళ్తుంటారు. ఈ విషయం అందరికి తెలుసు. ఇటీవల విడుదలైన బ్రో సినిమాలో పెద్దగా కథ లేకపోయినా పవన్ మీదున్న అభిమానంతోనే వెళ్తున్నారు. సినిమాలో కథలో పట్టు లేకపోయినా సినిమా మంచి టాక్ తెచ్చుకోవడం విశేషం. ఈనేపథ్యంలో రెండు రోజుల్లోనే రూ. 75 కోట్లు కొల్లగొట్టి మరోసారి తనకెదురు లేదని నిరూపించాడు.
ప్రముఖ కమెడియన్ అలీతో జరిగిన ఇంటర్వ్వూలో అడిగిన ఓ ప్రశ్నకు రచయిత విజేంద్రప్రసాద్ పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కోసం మీరు కథ రాస్తే ఎలాంటి కథను తీసుకుంటారని అడిగితే ఆయనకు కొత్త కథ అవసరం లేదు. పాత సినిమాల్లోని సన్నివేశాలను తీసుకున్నా ప్రేక్షకులు ఆదరిస్తారు. అది పవన్ కల్యాణ్ శక్తి.
కేవలం ఆయనను చూడటానికే ప్రేక్షకులు థియేటర్ కు వస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పవన్ కల్యాణ్ లోని పాత సీన్లతో సినిమాగా తీయొచ్చు. డైనమైట్ ను పేల్చడానికి చిన్న అగ్గిపుల్ల అయినా చాలు అని తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ప్రస్తుతం బ్రో సినిమాలో కూడా అదే జరిగిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పవన్ కల్యాణ్ శక్తి సామర్థ్యాల విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు.
పవన్ కల్యాణ్ అంటేనే ఓ ప్రబలమైన శక్తి. ఆయనకున్న అభిమానుల సంఖ్య చూస్తే అందరికి ఆశ్చర్యకరమే. తనదైన శైలిలో నటిస్తూ వారిని రంజింప చేయడమే ముఖ్య ఉద్దేశం. ఇలా పవన్ సినిమా అంటే ప్రేక్షకులకు పండగే. ఈ క్రమంలోనే బ్రో సినిమాలో పెద్దగా కథ లేకపోయినా కేవలం పవన్ కల్యాణ్ కోసమే ప్రేక్షకులు థియేటర్ కు వెళ్తున్నారనే విషయం నిర్వివాదాంశం.