
Aishwarya Rajesh : ఐశ్వర్య రాజేష్.. ఈమె గురించి తమిళ్, తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.. టాలెంట్ తో ఈ రేంజ్ కు చేరుకుంది.. కేవలం తన నటనను నమ్ముకుని ఈ రేంజ్ కు చేరుకున్న ఈ ముద్దుగుమ్మ మంచి మంచి సినిమాలను ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు వెళుతుంది.. తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఈమెకు తెలుగులో అవకాశాలు నిల్ అనే చెప్పాలి.
ఐశ్వర్య తెలుగు నటుడు రాజేష్ కూతురు.. అయితే ఈమె ముందుగా తమిళ్ సినిమాలతో కెరీర్ ను స్టార్ట్ చేసింది.. తమిళ్ తర్వాత మలయాళం, హిందీ సినిమాలు కూడా చేసిన తర్వాత తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది. లేడీ ఓరియెంటెడ్ మూవీ కౌసల్య కృష్ణమూర్తి వంటి మంచి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.. ఈ సినిమాలో ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి..
ఇక ఆ తర్వాత ఐశ్వర్య విజయ్ దేవరకొండతో కలిసి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో ఈమె మరింత మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది.. ఇటీవలే ఈమె నటించిన ఫర్హానా సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చింది.. తెలుగులో సినిమాలు ఎందుకు చేయడం లేదో చెప్పుకొచ్చింది. అలాగే ఈ సందర్భంగా రష్మిక గురించి కూడా చెప్పింది.
పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర లాంటి పాత్రలు తనకు బాగా సెట్ అవుతాయని చెప్పింది. ఈ మాటలను కొంతమంది వక్రీకరించారని ఈమె తాజాగా వివరణ ఇచ్చింది. శ్రీవల్లి పాత్రని తాను రష్మిక కంటే బాగా చేసేదాన్ని అంటూ ఈమె అన్నట్టు రాయడంతో ఫ్యాన్స్ ఈమెపై ఫైర్ అయ్యారు. దీనికి ఈమె వివరణ ఇస్తూ నాకు పుష్ప లోని శ్రీవల్లి లాంటి పాత్రలను చేయాలని అనుకుంటున్నాను అని.. అంతేకాని రష్మికను ఏమీ అనలేదు అంటూ ఈమె స్టేట్మెంట్ ఇచ్చింది..