మన ఊళ్లలో హీరోల కంటే హీరోయిన్లే ఎక్కువగా ఉన్నారని, అందుకే ప్రతి హీరోయిన్ కు పని దొరకడం లేదన్నారు. ఇక నా విషయానికి వస్తే చాలా మంది తారలు, ఇతర సెలబ్రిటీలు నా అద్భుతమైన నటనకు స్టేజ్ మీద నన్ను పొగుడుతున్నారు, కానీ వారు నన్ను వారి ప్రాజెక్ట్ లలో అవకాశం ఇవ్వరు” అని ఐశ్వర్య తెలిపింది. “నేను చిన్న బడ్జెట్ మహిళా ప్రాధాన్య చిత్రాలతో నటించి అభిమానుల హృదయం లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నానని, ఇప్పటికే 15 సినిమాల్లో నటించానని చెప్పింది.
సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్ గా మెప్పించాలంటే అభినయం తో పాటు అందాల ఆరబోత కూడా ఉండాల్సిందే . ఇలా ముంబయి, ఇతర దేశాల నుండి వచ్చే వారికి దర్శకులు తమ సినిమాల్లో అవకాశం కల్పిస్తున్నారు. కానీ సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ వంటి టాలెంటెడ్ బ్యూటీలు ఎలాంటి అసభ్యకరమైన పాత్రల్లో నటించకుండా కేవలం తమ విలక్షణమైన నటన తో తమకంటూ ఓ ప్రత్యేకమైన అభిమానులను కలిగినా అవకాశాల కోసం ఎదురు చూసే పరిస్ధితి నెలకొంది. మన సినీ రంగానికి ఇలాంటి నటీమణులు ఎందరో రావాల్సిన అవసరం ఎంతో ఉంది.