Aishwarya Rajesh : ఐశ్వర్య రాజేష్ కోలీవుడ్ లో క్లిక్ అయిన తెలుగు భామ.. ఈమె తమిళ్, మలయాళం, హిందీ సినిమాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగమ్మాయి అయిన ఇక్కడ అవకాశాలు మాత్రం సూన్యం.. కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మంచి పేరు తెచ్చుకుంది..
ఆ తర్వాత ఐశ్వర్య విజయ్ దేవరకొండతో కలిసి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించి మెప్పించిన కూడా మరో అవకాశం రాలేదు. ఈ మధ్య స్టార్ హీరోల సరసన అవకాశాలు రాకపోవడంపై స్టేజ్ మీదనే అసహనం వ్యక్తం చేసింది.. దీంతో ఈమె ఇక్కడ ఆఫర్ రాకపోయినా తమిళ్ లో మాత్రం వరుస సినిమాలతో దూసుకు పోతుంది.. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది.
అయితే ఈమె కెరీర్ మొదట్లో చాలా అవమానాలు ఎదుర్కున్న అంటూ ఆనాటి చేదు అనుభవాలను పంచుకుంది.. తాజాగా ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ.. నేను చాలా లో బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను.. స్టార్ కిడ్ కాదు.. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక నల్లగా ఉన్నావ్ నీకు సినిమాలు అవసరమా అంటూ మాట్లాడారు.. టాలెంట్ ఉన్న అవకాశాలు ఇవ్వం అంటూ ముఖం మీదనే చెప్పేసారు..
నా కలర్ గురించి కామెంట్ చేసారు.. కొందరైతే నా సైజుల గురించి కూడా నీచమైన కామెంట్స్ చేసారు.. అయినా అవన్నీ నేను పట్టించుకోకుండా నా ప్రయత్నాలు చేసి ఈ రోజు ఈ స్థాయిలో మీ ముందు ఉన్నాను అంటూ ఈమె ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి..