Aishwarya Rajesh Traditional Look :
ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఈ భామ తమిళ్, మలయాళం, హిందీ సినిమాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తెలుగమ్మాయి అయిన అవకాశాలు మాత్రం సూన్యం..
లేడీ ఓరియెంటెడ్ మూవీ కౌసల్య కృష్ణమూర్తి వంటి మంచి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వగా ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.. ఇక ఆ తర్వాత ఐశ్వర్య విజయ్ దేవరకొండతో కలిసి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించి మెప్పించిన కూడా ఈమెకు మరో అవకాశం రాలేదు.
దీంతో ఈ భామ తమిళ్ లోనే సినిమాలు చేసుకుంటూ బిజీగా మారింది. ఈమె సినిమాల పరంగా ఎలా ఉన్న వరుస ఫోటో షూట్ లతో ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. క్రేజీ పోస్టులు పెడుతూ అమ్మడు ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతుంది.
తాజాగా ఈ భామ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. సారీలో దిగిన పిక్స్ షేర్ చేయగా వీటికి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.. బ్లూ కలర్ శారీలో బ్యూటిఫుల్ లుక్ లో అమ్మడు ఆకట్టుకుంటుంది. మరి ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ పిక్స్ మీకోసం..