భగవద్గీత జీవిత సారాంశాన్ని చక్కగా వివరిస్తోంది. అయితే క్షణం కూడా తీరిక లేని గజిబిజి జీవిత ప్రయాణంలో…. భగవద్గీత ఏం చెబుతోంది ……. దాని పరమార్థం ఏంటి ? అనే విషయాలను పట్టించుకున్న దాఖలాలే లేవు. అయితే భగవద్గీతను పూర్తిగా చదవకపోయినా అందులోని కొన్ని అంశాలను మాత్రం చూచాయగా తెలుసుకోవచ్చు.
తాజాగా ఓ మహిళ భగవద్గీత లోని సారాంశాన్ని తన నృత్యంతో చక్కగా వివరించే ప్రయత్నం చేసింది.
1) ఆత్మ
2) పరమాత్మ
3) కర్మ
4) మోక్ష
5) యోగ
6) త్రిగుణ
భగవద్గీత నుండి ముఖ్యంగా ఆ ఆరు గుణాలను జీవిత సత్యాలుగా పరిగణించవచ్చు. ఈ ఆరు గుణాలు కూడా జీవిత సత్యాన్ని , పరమాత్మ సందేశాన్ని స్పష్టం చేస్తున్నాయి. దైనందిన జీవితంలో మనిషి తన మనుగడ కోసం ప్రకృతికి విరుద్దంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో ఈ ఆరు సుగుణాలను స్మరించుకుంటే భావి తరాలకు ఓ మంచి సందేశాన్ని , మంచి జీవితాన్ని ఇచ్చిన వారౌతారు.