అంకురా హాస్పిటల్ మరో బ్రాంచ్ కు శ్రీకారం చుట్టింది. గర్భిణీ స్త్రీలకు పరిపూర్ణమైన వైద్యశాలలు ఉండాలని భావించి , అధునాతనమైన హాస్పిటల్ కు నడుం బిగించారు అంకురా హాస్పిటల్స్ యాజమాన్యం. గర్భధారణ నుండి ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనిచ్చేంత వరకు అలాగే తల్లీ బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేలా ……. ఆరోగ్యకరమైన భావి తరాలను అందించడానికి శ్రీకారం చుట్టింది అంకురా హాస్పిటల్. ఇప్పటికే పలు శాఖలతో ప్రజల మనస్సులను గెలుచుకున్న అంకురా తాజాగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో మరో శాఖను ఏర్పాటు చేసింది.
ఇక ఈ హాస్పిటల్ ను అభినవ దాన కర్ణుడిగా పేరు గాంచిన సోనూ సూద్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది. మానవతా దృక్పథంతో , ఆరోగ్యకరమైన నవ భారతాన్ని నిర్మించాలని , అందించాలనే గొప్ప లక్ష్యంతో సోనూ సూద్ చేత 13 వ బ్రాంచ్ ప్రారంభించింది. అంకురా హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా గచ్చిబౌలిలో ప్రారంభమైంది. ఈ ప్రారంభ వేడుకలో ప్రముఖ నటులు సోనూ సూద్ , UBlood యాప్ ఫౌండర్ , JSW & Jaiswaraajya.tv సంస్థల అడ్వైజర్ డాక్టర్ జై యలమంచిలి , అంకురా హాస్పిటల్ యాజమాన్యం , వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.