31.5 C
India
Sunday, June 16, 2024
More

    Supreme Hero : సుప్రీం హీరోను ఆటపట్టించిన స్టార్ హీరోయిన్లు..

    Date:

    Supreme Hero Chiranjeevi
    Supreme Hero Chiranjeevi

    Supreme Hero Chiranjeevi : టాలీవుడ్ లో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ముందు నుంచి తన తోటి నటీనటులతో సెట్లో ఎంతో సరదాగా ఉండేవాడు. నెంబర్ వన్ హీరోగా ఎదిగినా ఇప్పటికీ అంతే సరదా ఉంటారని అప్పటి నటులతో పాటు ఇప్పటి యాక్టర్లు కూడా చెబుతుంటారు.   ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో  విలన్ క్యారెక్టర్ల నుంచి మాస్ హీరోగా ఎదిగారు. సీనియర్ ఎన్టీఆర్  తర్వాత మళ్లీ అంతటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో చిరంజీవి అంటే అతిశయోక్తి కాదు.  తెలుగు తెరకు సరికొత్త స్టెప్పులను పరిచయం చేసింది చిరంజీవే.

    మెగాస్టా్ర్ చిరంజీవికి పలువురు డైరెక్టర్లతో సూపర్ హిట్ కాంబినేషన్ అనే పేరు ఉంది. ఇందులో ముందున్నది కోదండరామిరెడ్డి, విజయబాపినీడు, కే రాఘవేంద్రరావు.   చిరంజీవి-కోదండ రామిరెడ్డి కాంబినేషన్ లో దాదాపు 20కి పైగా చిత్రాలు వచ్చాయి. ఇందులో దాదాపు అన్నీ హిట్లే. అలాగే  చిరంజీవి– విజ‌య‌బాపినీడు కాంబినేష‌న్లో ఆరు సినిమాలు వ‌చ్చాయి. ఇందులో బిగ్‌బాస్ సినిమా మిన‌హా మిగతా అన్ని సినిమాలు సూప‌ర్ హిట్లే.

    1983లో ఖైదీ సినిమాతో మాస్ హీరోగా స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు  చిరంజీవి.  అప్పుడు చిరంజీవిని సుప్రీం హీరో ట్యాగ్ తో పిలిచేవారు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న చిరంజీవిని ఓ సినిమా షూటింగ్ సమయంలో  అప్పటి స్టార్ హీరోయిన్లు టీజ్ చేస్తున్న ఫొటో బయటికి రాగా వైరల్ గా  మారింది.  1986లో మ‌గ‌ధీరుడు సినిమా షూటింగ్ జరుగుతుండగా, అదే సమయంలో పక్కనే ప్రెసిడెంట్ గారి అబ్బాయి చిత్రం షూటింగ్ కూడా అక్కడే జరిగింది. షూటింగ్ గ్యాప్ లో అప్పటి స్టార్ హీరోయిన్లు   జయసుధ, సుహాసిని, సుమలత  చిరంజీవిని ఆటపట్టించారు. ఆ సమయంలో  తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  చిరంజీవి, జయసుధ కాంబినేషన్ లో వచ్చిన ఒకే ఒక్క చిత్రం మగధీరుడు. మళ్లీ వారి కాంబినేషన్ మరో సినిమా రాలేదు.  ఇక అప్పటి స్టార్ హీరోయిన్లు  రాధ, రాధిక, సుహాసిని, సుమలత ఏదేని వేదికలో ఇప్పటికీ చిరంజీవిని  ఆటపట్టిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Satya Kumar Yadav : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

    Satya Kumar Yadav : ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

    CM Chandrababu : నామినేటేడ్ పదవులు కష్టపడ్డ వారికే ఇస్తాం.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు

    CM Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా చంద్రబాబు నాయుడు...

    West Godavari District : బ్యాటరీని మింగిన చిన్నారి.. ఎండోస్కోపీ ద్వారా తొలగించిన వైద్యులు

    West Godavari District : నెలల వయసున్న ఓ చిన్నారి బ్యాటరీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR-Chiranjeevi : తారక్ కు మెగాస్టార్ విషెస్.. యంగ్ స్టార్ రీ ట్వీట్ ఏం చేశారంటే?

    NTR-Chiranjeevi : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ సెలబ్రిటీగా మారిన...

    Mrugaraju : చిరంజీవి మృగరాజు కోసం ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..

    Mrugaraju : ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు....

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Maharshi Radhava : వందోసారి రక్తదానం చేసిన నటుడు.. సన్మానించిన మెగాస్టార్

    Maharshi Radhava : చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నటుడు మహర్షి రాఘవ...