
First Bill in New Parliament : సుధీర్ఘ కాలం (దాదాపు 96 సంవత్సరాలు) సేవలందించిన భారత పార్లమెంట్ భవనం నేటి (సెప్టెంబర్ 19) నుంచి సెలవు తీసుకోనుంది. దేశ స్వరూపం, సౌబ్రాతృత్వం, ప్రజల ఆశలు, ఆకాంక్షల కోసం తీసుకున్న నిర్ణయాలు, రాజ్యాంగం పుట్టుకకు కారణమైన స్థలం.. దేశం యావత్తు రుణం తీర్చుకోలేని భవనం మన పార్లమెంట్ భవనం.
1921లో ఈ భవనం నిర్మాణానికి పునాది పడగా.. 1927లో వినియోగంలోకి వచ్చింది. ఐదేండ్లలో భవనం పూర్తయింది. ఇక భారత్ కు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 1950 వరకు ఇందులోనే భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. తర్వాత వసతుల కోసం అప్పుడప్పుడు నిర్మాణాలు చేపట్టారు. ఇన్నేళ్లు తన సేవలను అందించిన పార్లమెంట్ భవనం ఇక సందర్శకుల కోసం మాత్రమే తెరిచి ఉంటుంది.
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్ సభ్యులతో కలిసి మంగళవారం (సెప్టెంబర్ 19)వ తేదీ ప్రారంభించారు. వినాయక చివితి సందర్భంగా కొత్త పార్లమెంట్ భవనంలోకి వచ్చిన సభ్యులు కొత్త భవనంలో మహిళా (అమ్మవారి) బిల్లుపై చర్చ ప్రారంభించారు. కొత్త భవనంలో అమ్మవారికి నివాళిగా మహిళా బిల్లు పెట్టడం ఆనందంగా ఉందిని మహిళలు ఆనంద పడుతున్నారు.
నెటిజన్లు కూడా ఈ బిల్లు మొదటిది కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ నిర్ణయాలపై సోషల్ మీడియాలో భిన్నంగా అభిప్రాయాలు వ్యక్తం అవుతుండగా మహిళా బిల్లు మాత్రం చారిత్రక పరిణామం అంటూ కలిసి కట్టుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు కనుక పాస్ అయితే ఇప్పటి వరకు కేవలం ఉద్యోగ, ఉపాధి లో మాత్రమే మహిళలకు అందుబాటులోకి వచ్చిన 33 శాతం రిజర్వేషన్ ఇక నుంచి శాసన సభ, పార్లమెంట్ లలో కూడా అందుబాటులోకి వస్తుంది.
అంటే ఇక పార్లమెంట్, శాసన సభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాల్సిందే. మనకు పాలిచ్చి పెంచిన తల్లులే ఇక మనలను పాలిస్తారని మరో అమ్మ పాలనలో ఆనందంగా ఉంటామని దేశం యావత్తు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.