Tamanna in Parliament : మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నూతన పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు.. గురువారం రోజున ఈమె పార్లమెంట్ దగ్గర మెరిసింది.. ఈమెకు ఆహ్వానం అందడంతో కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించడానికి విచ్చేసింది. ఇక్కడకు తమన్నా ఎర్ర రంగు చీరలో ట్రెడిషనల్ గా పద్ధతైన చీర కట్టుతో ఆకట్టు కుంది. అక్కడ ఈమె అడుగు పెట్టగానే మీడియా వారంతా ఈమె పలకరించారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడం మంచి విషయం అని ఇది శుభ పరిణామం అని తమన్నా చెప్పారు.. ఈ చారిత్రక బిల్లును తీసుకు వచ్చిన మోడీ సర్కార్ పై కూడా తమన్నా ప్రశంసలు కురిపించింది. మహిళా రిజర్వేషన్ వల్ల సామాన్య ప్రజలు సైతం రాజకీయాల్లో చేరేలా స్ఫూర్తిని ఇస్తుందని ఈ బిల్లుతో మహిళలకు మరింత సాదికారిత లభిస్తుందని వ్యాఖ్యానించారు.
ఇక ఇక్కడ తమన్నాతో పాటు మరో నటి దివ్యా దత్తా కూడా విచ్చేసారు.. నూతన పార్లమెంట్ దగ్గర తమన్నా కనిపించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈ పార్లమెంట్ భవనంలో మంగళవారం బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుపై తనదైన శైలిలో కామెంట్స్ చేసారు.
ఈ బిల్లుపై కేంద్రంపై ప్రశంసలు కురిపించారు.. ఆ తర్వాత షెహనాజ్ గిల్, భూమి ఫెడ్నేకర్ పార్లమెంట్ భవనం వద్దకు వచ్చి మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడారు.. మహిళలకు సమానత్వం, హక్కులు కల్పిస్తే తద్వారా దేశంలో చాలా మార్పులు వస్తాయని షెహనాజ్ గిల్ సైతం అన్నారు.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ బిల్లును రాజ్యసభ ముందు ప్రవేశ పెట్టారు. అయితే ఈ బిల్లు ఆమోదం పొందిన కూడా 2029 తర్వాతనే అమలులోకి రానుంది.