
CM convey : ప్రముఖుల పర్యటనలో ఎలాంటి అపశ్రుతి ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు సెక్యూరిటీ అధికారులు, పోలీసులు. కానీ ఇక్కడ ఒక పోలీస్ అధికారే సీఎం కాన్వాయ్ కి ఎదురెళ్లాడు. ఆపేందుకు యత్నించాడు. దీంతో సెక్యూరిటీ అధికారులు, పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తాను మంచి కోసమే అలా వెళ్లానని సదరు కానిస్టేబుల్ చెప్తున్నా.. అధికారులు, తోటి సిబ్బంది మాత్రం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
గతంలో ఒక రాష్ట్రానికి పర్యటన కోసం వెళ్లిన ప్రధాన మంత్రి కాన్వాయ్ ని నిరసన కారులు అడ్డుకున్నారు. సాధారణంగా పీఎం, సీఎం, కేంద్ర మంత్రులు వస్తున్న సమయంలో సమస్యలపై విన్నవించుకోవాలంటే బారీకేడ్ల అవతలి నుంచి మాత్రమే చెప్పుకోవాలి. కానీ దేశానికే ప్రధానిని రోడ్డుపై నిరసన కారులు అడ్డుకున్నారు. దీనిపై అప్పట్లో దేశం నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చ జరిగింది. వెంటనే అక్కడ ఉండే పోలీస్ బాస్ లు, ప్రభుత్వ పెద్దలను తొలగిస్తూ కొన్ని ఆదేశాలు వెలువడ్డాయి. అవన్నీ పక్కన పెడితే ఏపీలో సీఎం కాన్వాయ్ ను అడ్డుకునేందుకు ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఎవరు ఎందుకు అడ్డుకోవాలని అనుకున్నాడు ఇక్కడ తెలుసుకుందాం.
గుంటూరు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ హెలీకాప్టర్ లో తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు. హెలీప్యాడ్ నుంచి సీఎం తన వాహనంలో ఇంటికి బయల్దేరి వెళ్తున్నాడు. అయితే గార్డ్-1 కమాండర్ గా విధులు నిర్వర్తిస్తున్న విశాఖపట్నంకు చెందిన 16వ బెటాలియన్ బీ-కంపెనీలో పని చేసే హెడ్ కానిస్టేబుల్ పెద్దరెడ్డి భాగ్యరాజు కాన్వాయ్ కు ఎదురెళ్లాడు. ఆపే ప్రయత్నం చేశాడు. ఇంతలో సీఎం సెక్యూరిటీ గార్డ్స్ స్పందించి పెద్దిరెడ్డి భాగ్యరాజును అడ్డుకున్నారు. అయితే తాను విశాఖలో పని చేస్తున్నానని, తన భార్య విజయవాడలో ఉద్యోగం చేస్తుందని, ఇద్దరినీ ఒకే చోట కలిపేందుకు అవకాశం కల్పించాలిన సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్నట్లు ఆయన చెప్పుకచ్చారు. ఏది ఏమైనా సీఎం కాన్వాయ్ వస్తుందంటే బందోబస్తు నర్వర్తించాల్సిన కానిస్టేబులే తన అవసరం కోసం ఆపమని అడ్డు వెళ్లడం చర్చకు తావిస్తోంది.