RGV : టాలీవుడ్ లో ఇప్పుడు భోళా శంకర్ పై వస్తున్న ట్రోల్స్, విమర్శలు అన్నీ ఇన్నీ కావు. చూసిన వారంతా సినిమా పరమచెత్తగా ఉందని అంటున్నారు. ఇది ఒకవైపు అయితే.. ఇంకోవైపు ఆర్జీవీ ఆడేసుకుంటున్నాడు. భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది కావాలనే ఆర్జీవీని గెలికి మరీ కౌంటర్లు వేశాడు.
ఓ రేంజ్ మెగా హీరోల భజన చేశాడు. మరి తనను గెలక్కుండా ఉంటేనే సెటైర్లు వేసే ఆర్జీవీ.. తనను గెలికిన తర్వాత ఊరుకుంటాడా. భోళా శంకర్ రిజల్ట్ ఆర్జీవీకి పెద్ద ఆయుధంలా మారిపోయింది. నిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత హైపర్ ఆదిని ఏసుకున్నాడు. జబర్, హైపర్ లాంటి వాళ్ల పొగడ్తలకు అలవాటు పడిన మెగాస్టార్ తన రియాల్టీకి దూరం అవుతున్నాడని కౌంటర్లు వేశాడు.
ఈ రోజు మరో ట్వీట్ తో దుమ్ము దులిపేశాడు. ఈ సారి కూడా ఇన్ డైరెక్ట్ గా హైపర్ ఆదికి కౌంటర్లు వేశాడు. ఆయన ట్వీట్ లో ఇలా ఉంది.. పొగడ్తలతో ముంచే వాళ్ల బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వారు ఉండరు.. నిజం తెలుసుకునే లోగా రాజుగారు మునిగిపోతారు. వాళ్ల పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే వాళ్లను మైల్ దూరం పెట్టాల్సిందే.. అంటూ రాసుకొచ్చాడు.
అంటే చిరంజీవి ఏం చేసినా బాగుందని భజన బ్యాచ్ చెప్తే దాన్నే నిజమనుకుంటే.. సినిమా రిజల్ట్ ఇలా ఉంటుంది. అలాంటి వారిని పక్కన పెడితేనే చిరంజీవి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడని.. లేదంటే వారే పొగడ్తలతో నిండా ముంచేస్తారని చెప్పాడు ఆర్జీవీ. హైపర్ ఆది లాంటి బచ్చాగాళ్లను పక్కన పెడితేనే.. మెగాస్టార్ స్థాయి మళ్లీ పెరుగుతుందని.. లేదంటే అలాంటి వారే ఆయన్ను దిగజార్చుతారంటూ సెటైర్లు పేల్చాడు ఆర్జీవీ.