31 C
India
Monday, April 29, 2024
More

    RGV Vyooham : ‘‘పట్టు వదలని విక్రమార్కున్ని..’’ గన్ తో వచ్చేశాడు వర్మ..!

    Date:

    RGV Vyooham
    RGV Vyooham

    RGV Vyooham : రామ్ గోపాల్ వర్మ.. వివాదం ఆయన ఇంటిపేరు.. గిచ్చి కయ్యం పెట్టుకోవడం ఆయన నైజం..ముంబై బాలీవుడ్ ను వదలిపెట్టి వచ్చాక టాలీవుడ్ కు పరిమితమైన వర్మ నిత్యం వివాదాల్లో మునిగితేలుతూ ఉంటారు. సంవత్సరానికి ఓ ఐదారు లో కంటెంట్ సినిమాలు, ఓ రెండు పొలిటికల్ మూవీలు చేస్తుంటారు. అవి హిట్టా ఫట్టా అనే సంబంధం లేకుండా తన ఫ్యాక్టరీ నుంచి సినిమాలు బయటకు పంపిస్తూనే ఉంటాడు. నిత్యం వార్తల్లో ఉండడానికి ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తుంటాడు. దీంతో వచ్చే పబ్లిసిటీని ఎంజాయ్ చేస్తుంటాడు.

    తాజాగా వైసీపీకి అనుకూలంగా, టీడీపీ, జనసేనలకు వ్యతిరేకంగా వ్యూహం మూవీని రూపొందించిన విషయం తెలిసిందే. ఇది విడుదల కాకుండా వాయిదాలు పడుతూ వస్తోంది. మార్చి 2న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు వర్మ అధికారికంగా ప్రకటించారు. తొలుత ఫిబ్రవరి 25న రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ సాంకేతిక సమస్యల కారణంగా మార్చి 1వ తేదీకి వాయిదా పడింది. ఇప్పుడు ఓ రోజు ఆలస్యంగా అంటే మార్చి 2న ఆడియన్స్ కు ముందుకురాబోతోంది.

    తాజాగా ‘వ్యూహం’ సినిమా విడుదలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ‘‘పట్టు వదలని విక్రమార్కుడిని..’’ అని క్యాప్షన్ తో పాటు సెన్సార్ సర్టిఫికెట్ ను చేతిలో పట్టుకున్న ఫొటోను పోస్ట్ చేశారు. ‘‘వ్యూహం మార్చి 2న థియేటర్లలోకి వస్తోంది’’ అంటూ కామెంట్ చేశారు.  వాస్తవానికి రెండు నెలల క్రితమే ‘వ్యూహం’ రిలీజైపోవాలి. కానీ విడుదల నిలిపేయాలని నారా లోకేశ్.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు అడ్డంకులన్నీ క్లియర్ అయిపోవడంతో థియేటర్లలోకి రానుంది.

    Share post:

    More like this
    Related

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RGV-Supritha : సురేఖా వాణి కూతురు సుప్రీతతో రామ్ గోపాల్ వర్మ.. ఏం చేస్తున్నారంటే?

    RGV-Supritha : రాంగోపాల్ వర్మ గురించి పరిచయం కావాలా? ఇండియన్ ఫిల్మ్...

    kolikapudi Arrest : కొలికపూడి అరెస్టుపై అంత అత్యుత్సాహం అవసరమా? 

    kolikapudi Arrest : నేడు అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి...

    RGV Vyooham : ‘వ్యూహం’ సెన్సార్ షిప్ సర్టిఫికెట్ రద్దు? వర్మ ఏం చెప్తున్నాడు?

    RGV Vyooham : రామ్ గోపాల్ వర్మ ఏదీ చేసినా సంచలనమే....

    RGV Vyuham : బెడిసికొట్టిన వర్మ ‘వ్యూహం’..అట్టర్ ప్లాప్ అయ్యిందిగా!

    RGV Vyuham : శివ, రంగీలా, సత్య, సర్కార్.. వంటి సినిమాలు...