Child Actors :
తెలుగు సినిమాల్లో బాల నటులుగా పరిచయమై హీరో, హీరోయిన్లుగా రాణించే వారు చాలా మందే ఉన్నారు. బాల నటులను తీసుకుంటే శ్రీదేవి 18 నెలల నుంచే నటించిందట. అంటే అంత చిన్న వయసు నుంచే ఆమె తన కెరీర్ ప్రారంభించింది. అదే బాటలో మీనా, రాశి, బాలాదిత్య, కమల్ హాసన్, తులసి, కల్యాణ్ రామ్ వంటి వారు ఉన్నారు. చిన్నతనంలో వారు నటించి పెద్దయ్యాక కూడా తమ టాలెంట్ ప్రదర్శిస్తున్నారు. బాలనటులుగా వచ్చి గుర్తుండిపోయే విధంగా చిత్రాలు తీస్తున్నారు.
గంగోత్రి సినిమా అల్లు అర్జున్, అదితి అగర్వాల్ కు మొదటి సినిమా. ఇది వంద రోజులు పూర్తి చేసుకుని వేడుకలు నిర్వహించుకుంది. ఇందులో చిన్నప్పటి అల్లు అర్జున్ పాత్రలో తేజ, హీరోయిన్ అదితి అగర్వాల్ పాత్రలో కావ్య నటించారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. తేజ, కావ్య కల్యాణ్ రామ్ మసూదలో నటించి మెప్పించారు. ఓ బేబి, అద్భుతం, ఇష్క్, జాంబిరెడ్డి వంటి చిత్రాల్లో తేజ నటించి తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు.
ఇక కావ్య కల్యాణ్ రామ్ బలగం సినిమాలో నటించింది. బాల నటిగా గంగోత్రిలో మెప్పించిన కావ్య బలగంలోనూ తనదైన శైలిలో నటించింది. దీంతో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇలా చిన్ననాటి పాత్రల్లో చూపిన టాలెంట్ ఇప్పుడు కూడా చూపించి వారు మంచి పాన్ ఇండియా స్టార్లుగా ఎదుగుతున్నారు. రేపటి బాలలే రేపటి పౌరులు అన్నట్లుగా పైకి వస్తున్నారు.
నటనలో చిన్న నాటి నుంచే ఎంతో నేర్చుకుంటున్నారు. తమను మార్చుకుని నటనలో ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు. పాన్ ఇండియా స్థాయికి చేరుతున్నారు. ఇలా చైల్డ్ ఆర్టిస్టులే భవిష్యత్ హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. గంగోత్రి సినిమాతో చిన్ననాడే ఎంట్రీ ఇచ్చిన తేజ, కావ్య కల్యాణ్ రామ్ లు ప్రస్తుతం తెలుగు సినిమా రంగాన్ని ఏలుతున్నారు.