21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Trivikram Remuneration : పంతం నెగ్గించుకున్న త్రివిక్రమ్..

    Date:

    • దర్శకుడితో సమానంగా రెమ్యునరేషన్? 
    • అబ్జెక్షన్ చెప్పని స్టార్ హీరో..
    Trivikram Remuneration
    Trivikram Remuneration
    Trivikram Remuneration : టాలీవుడ్ లో హీరో తర్వాత దర్శకుడిదే పై చేయి. నిర్మాత కేవలం క్యాషియర్ మాత్రమే.  దాసరి నారాయణ, రాఘవేంద్రరావు తర్వాత కోదండరామిరెడ్డి, బీ గోపాల్ తదితరులు పై చేయి సాధించారు. వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు. సొంత డిస్ర్టిబ్యూషన్,  నిర్మాణ సంస్థ  ఉన్న ఓ  హీరో సక్సెస్ కోసం రైటర్ కండీషన్లకు ఒప్పుకోక తప్పలేదు. అప్పుడప్పుడే లైమ్ లైట్ లో ఉన్న దర్శకుడు, రచయితను  పిలిపించుకున్నాడు స్టార్ హీరో.  తనకో  హిట్ పడాలని చెప్పాడు. అయితే ఆ హీరో మరెవరో కాదు. యువ సామ్రాట్ నాగార్జున.
    1999-2001 నలుగురికి సక్సెస్ లే..
    టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున 1999 నుంచి 2001 వరకు అందరూ సూపర్ హిట్లు కొట్టారు. కానీ  ఆ తర్వాతే నాగార్జునను వరుసగా  సినిమాలు  దెబ్బకొట్టాయి.  హ్యట్రిక్ హిట్లతో జోరు మీదన్న నాగార్జునను  ప్లాఫ్లు లు వెంటాడాయి. సీతారామరాజు, నిన్నే ప్రేమిస్తా, నువ్వువస్తావని సినిమాలతో వరుస హిట్లు అందుకున్నాడు నాగార్జున. అదే ఊపులో తన మేనల్లుడు సుమంత్ తో కలిసి తొలిసారి నటించిన స్నేహమంటే ఇదేరా మొదటి షో నుంచే ప్లాఫ్ టాక్ తెచ్చకుంది. దీని నుంచి తేరుకోక ముందు వచ్చిన ఆకాశ వీధిలో  భారీ డిజాస్టర్ గా నిలిచింది. మోహన్ బాబు హీరోగా చేసిన అధిపతి సినిమాలో గెస్ట్ రోల్ చేసినా అది కూడా ప్లాఫ్ గానే మిగిలింది. ఆ తర్వాత వచ్చిన బావ నచ్చాడు సినిమా కూడా ఘోర పరాజయం పాలైంది.  ఆ తర్వాత డబుల్ రోల్ చేసిన ఎదురులేని మనిషి కూడా  ఆడలేదు. వరుస ప్లాఫ్ లతో నాగార్జున  డల్ అయ్యాడు. అదే సమయంలో  చిరు, బాలకృష్ణ, వెంకటేశ్ మాత్రం హిట్లు కొడుతున్నారు. దీంతో ఎలాగైనా హిట్టుకొట్టాలని భావించిన నాగార్జున కొత్త సినిమాను తన సొంత ప్రొడక్షన్ లోనే  చేయాలని నిర్ణయించుకున్నాడు.
    విజయ భాస్కర్, త్రివిక్రమ్ హిట్ కాంబినేషన్! 
    మొదటి సినిమా తర్వాత ఆరేళ్ల గ్యాప్ తో మళ్లీ మెగాఫోన్ అందుకున్న విజయ భాస్కర్ చేసిన సినిమా నువ్వే కావాలి. దీనికి రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. బాలనటుడు తరుణ్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త ట్రెండ్ సెట్టర్ల గా  నిలిచింది. త్రివిక్రమ్, విజయ భాస్కర్ కాంబినేషన్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన చిత్రం నువ్వు నాకు నచ్చావ్. ఈ సినిమా కూడా అంతకు మించి విజయం సాధించింది. దీంతో త్రివిక్రమ్, విజయ భాస్కర్ కు హిట్ పెయిర్  గా పేరొచ్చింది.
    అప్పుడే నాగార్జున తన మూస ధోరణి చిత్రాలు వీడాలని వీరిద్దరిని పిలిపించుకున్నాడు. ఎంటర్టైన్ మెంట్ లో మీ పంథాలో నే సినిమా రాయాలని చెప్పాడు. కానీ త్రివిక్రమ్ అప్పటికే దర్శకుడిగా ప్రయత్నాలు  చేస్తున్నాడు. మొదట ఒప్పుకోకున్నా నాగార్జునే స్వయంగా అడగడంతో కాదనలేకపోయాడు. కానీ ఓ కండీషన్ పెట్టాడు. దర్శకుడికి ఇచ్చే రెమ్యూనరేషన్ తనకు కూడా ఇవ్వాలని ప్రపోజల్ పెట్టాడు. తప్పనిసరి పరిస్థితుల్లో దీనికి నాగార్జున  ఒప్పుకున్నాడు. ఒక్కొక్కరికి రూ. 75 లక్షల చొప్పున ఇచ్చాడు. అప్పటి సినిమా బడ్జెట్ లో ఇదే ఎక్కువ మొత్తం.  ఇది ఇండస్ర్టీలో హాట్ టాపిక్ గా మారింది.
    అప్పటికే టాలీవుడ్ లో అగ్ర రచయితలుగా వెలుగొందుతున్న పరుచూరి బ్రదర్స్ కు కడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ఏ నిర్మాత  ఇవ్వలేదు. ఒక్క సారి గా ఇండస్ర్టీ అంతా షాకయ్యింది. కానీ నాగార్జున ఖాతాలో  మాత్రం సూపర్ హిట్ పడింది.  అదే మన్మథుడు సినిమా. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దీనికి దర్శుకుడు విజయ భాస్కర్ కాగా, రైటింగ్ బాధ్యతలు త్రివిక్రమ్ తీసుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. సోనాలి బెంద్రే, అన్షు హీరోయిన్లు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Trivikram : త్రివిక్రమ్‌ను పక్కన పెడుతున్న తెలుగు హీరోలు… కారణం ఇదేనా?

    Trivikram : కొన్ని రోజుల క్రితం త్రివిక్రమ్ సినిమా అంటే హీరోలకి గ్యారంటీ...

    Trivikram : డైలమాలో పడిన త్రివిక్రమ్…ఇప్పుడు తన దారెటు…

    Trivikram : ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు....

    Bunny-Trivikram : మైథలాజికల్ ఫాంటసీగా బన్నీ-త్రివిక్రమ్ మూవీ.. కథ గురించి హింట్ ఇచ్చిన బన్నీ వాస్..

    Bunny-Trivikram Movie : పుష్ప2 షూటింగ్ దాదాపుగా పూర్తవడంతో తన నెక్ట్స్...

    Poonam Kaur : త్రివిక్రమ్ పై పూనమ్ ఆరోపణలు.. ఇన్నేళ్లకు నేరుగా పేరు పెట్టి మరీ..

    Poonam Kaur : నటి పూనమ్ కౌర్ కు కొన్ని సంవత్సరాలుగా...