Guntur kaaram : సంక్రాంతి విజేత తానేనంటూ ఎన్నో అంచనాలతో మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ బరిలోకి దిగుతోంది. ఈనెల 12 ఆడియన్స్ ముందుకొస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో హీరోగా ముందుగా మహేశ్ బాబును అనుకోలేదట. వేరే స్టార్ హీరో తీద్దామనుకున్నారట.. పలు కారణాలతో ఆ హీరో గుంటూరు కారాన్ని వదలుకున్నాడని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో గుసగుసలు వినపడుతున్నాయి.
ప్రిన్స్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. అతడు, ఖలేజా తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ మూవీ సాంగ్స్, పోస్టర్స్, గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకులను, ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఈ మూవీలో మహేశ్ కు జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. రీసెంట్ గా మీనాక్షి లుక్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ను ఈనెల 6న విడుదల చేయనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూఎస్ లో లైవ్ స్ట్రీమింగ్ కూడా ఇవ్వనున్నారట. దీంతో మహేశ్ ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం.
ఈసినిమాకు ఇప్పటికే మంచి హైప్ వచ్చింది. సంక్రాంతి సినిమాల్లో మీరే సినిమా చూస్తారు? అనే ఒపినియన్ పోల్ కు ఎక్కువ మంది ఈ సినిమానే చూస్తామన్నారు. దీని తర్వాత హనుమాన్ ఉండడం విశేషం. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా.. నాగవంశీ నిర్మించారు.
తాజాగా ఈసినిమాపై ఓ గాసిప్ తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాను ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీద్దామని త్రివిక్రమ్ భావించాడట. కానీ ఆ టైంలో ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక చేసేదేం లేక.. త్రివిక్రమ్.. మహేశ్ కు వినిపించారట. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియదు గానీ ఈ గాసిప్ వైరల్ గా మారింది. మరికొందరు మాత్రం ఈ కథను పవన్ కోసం రాశారని కూడా అంటున్నారు. ఇది కూడా గాసిప్ లాగానే కనపడుతోంది. ఈ గాసిప్స్ పై మహేశ్ ఫ్యాన్స్ స్పందిస్తూ ఈ కథను మహేశ్ బాబు కోసమే రాశారని..అదంతా ఉత్తుత్తి ప్రచారమే అని కొట్టిపడేస్తున్నారు.