33.8 C
India
Sunday, May 5, 2024
More

    Trivikram Srinivas : త్రివిక్రమ్ మల్టీస్టారర్.. మరో ‘నువ్వు నాకు నచ్చవ్’  పక్కా!

    Date:

    Trivikram
    Trivikram multi-starrer

    Trivikram Srinivas : త్రివిక్రమ్.. మాటల మాంత్రికుడు.. ప్రాసలు, పంచ్ లతో హాస్యం, ఎమోషనల్ డైలాగ్ లతో ఆడియన్స్ ను ఇంద్రజాలంలో ముంచెత్తుతాడు.  అబ్బా ఏం రాశాడో కదా..అనిపిస్తాడు. ఆయన కలం డైలాగ్ లను ఏ రకమైన ఆడియన్స్ నైనా  మెప్పించగలుగుతుంది. అందుకే ఆయన సినిమాల్లో డైలాగులు ప్రత్యేకంగా ఉంటాయి. ఆయన సినిమాలోని ప్రతీ మాట ఒక ఆణిముత్యమే అని చెప్పాలి.

    ప్రస్తుతం త్రివిక్రమ్ మహేశ్ మూవీ ‘గుంటూరు కారం’ ఫైనల్ షెడ్యూల్స్ తో బిజీబిజీగా ఉన్నారు. జనవరి 12న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. ఇక సంక్రాంతి దాకా ఆయన ఫుల్ బిజీనే అనిచెప్పాలి. ఇక పండుగ తర్వాత అల్లు అర్జున్ తో హారిక హాసిని సంస్థ ఓ మూవీని ప్రకటించింది. అయితే బన్నీ పుష్ప-2తో తీరిక లేకుండా ఉన్నారు. త్రివిక్రమ్ తో చేసే సినిమాకు కాస్త సమయం కావాలని కోరారట. దీంతో త్రివిక్రమ్ తన ప్లాన్ బీతో ముందుకొస్తున్నారు. ఈ గ్యాప్ లో ఓ మల్టీస్టారర్ తీద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఇది ఎప్పటి నుంచో చర్చల్లో ఉన్నా.. ఇప్పటికీ సమయం దొరికిందట. అది విక్టరీ వెంకటేశ్ తో మూవీ అట.

    వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ రైటర్ గా వచ్చిన ‘నువ్వు నాకు నచ్చవ్’, ‘మల్లీశ్వరీ’ పెద్ద హిట్లుగా నిలిచాయి. వెంకటేశ్ కెరీర్ లోనే ‘నువ్వు నాకు నచ్చవ్’ గుర్తుండిపోయే మూవీ. ఈ సినిమా ఇప్పటికీ టీవీల్లో వచ్చినా జనాలు ఎంజాయ్ చేస్తుంటారు. ఈ సినిమాను ఒక్కొక్కరు పది, ఇరవై సార్లు చూసుంటారు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాల్లో ఇది ఒకటి. ఈ మూవీతోనే త్రివిక్రమ్ కు స్టార్ రైటర్ గా పేరొచ్చింది. ఇక వెంకీతో దర్శకుడిగా త్రివిక్రమ్ మూవీ చేస్తుండడంతో జనాల్లో ఆసక్తినెలకొంది. మరో ‘నువ్వు నాకు నచ్చవ్’ లాంటి మూవీ అవుతుందని అంటున్నారు.

    ఈ మూవీ ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతుందట. ఇందులో ఒక్క వెంకటేశ్ మాత్రమే కాదు నేచురల్ స్టార్ నాని కూడా నటించబోతున్నారట. ఈ ముగ్గురి కాంబినేషన్ లో మూవీ అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. జనాలకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అనే చెప్పుకొవాలి. కామెడీని పంచడంలో వెంకటేశ్, నాని చెలరేగిపోతారు. ఇక త్రివిక్రమ్ పంచ్ డైలాగ్ లకు ఇక వీరికి హద్దు ఉంటుందా అని ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. మొత్తానికి మంచి బజ్ క్రియేట్ చేసే మూవీ రాబోతుందని మాత్రం చెప్పవచ్చు. అయితే మూవీకి సంబంధించిన వివరాలన్నీ ప్రస్తుతానికి త్రివిక్రమ్ గోప్యంగా ఉంచుతున్నారు. త్వరలోనే వివరాలు బయటకు రానున్నాయి.

    Share post:

    More like this
    Related

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో 19 మంది మృతి

    Telangana : తెలంగాణలో ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మరణిస్తున్నారు....

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Trivikram : త్రివిక్రమ్ లో పస తగ్గిందా? నెటిజన్ల ఆగ్రహం

    Trivikram : టాలీవుడ్ లో మంచి పేరున్న దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్...

    Guntur Karaam : ‘గుంటూరు’ కారం.. ప్రీరిలీజ్ ఈవెంట్ అక్కడే..

    Guntur Karaam : ప్రిన్స్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో సంక్రాంతికి...

    Guntur kaaram : ‘గుంటూరు కారం’ ఆ హీరో కోసం రాసిందా.. డేట్లు కుదరకనే మహేశ్ తో..?

    Guntur kaaram : సంక్రాంతి విజేత తానేనంటూ ఎన్నో అంచనాలతో మహేశ్...

    Guntur Kaaram : మహేశ్ బాబు సినిమాలోని వీడియో సాంగ్ లీక్.. శ్రీలీల డ్యాన్స్ కు నెటిజన్ల ఫిదా..

    Guntur Kaaram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-సూపర్ స్టార్ మహేశ్...