![Withdraw PF Money](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/02/Withdraw-PF-Money.jpg)
Withdraw PF Money : ఇటీవల కాలంలో ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పిస్తున్న ఉద్యోగాలు పెరుగుతున్నాయి. దీంతో నెలనెల కొంత సొమ్ము మన పేరు మీద పీఎఫ్ జమవుతూ ఉంటుంది. దీన్ని మనం ఉద్యోగం పోయినప్పుడు తిరిగి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. దీంతో మనం ఉద్యోగం ఊడిపోయి కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి తీసుకునే అవకాశం ఇస్తుంది. దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు.
ఇది చాలా మందికి తెలియదు. కానీ పీఎఫ్ ను మనం ఎప్పుడైనా తిరిగి తీసుకోవచ్చు. సంబంధిత మొత్తంలో కనీసం 75 శాతం మనం తిరిగి పొందే వీలుంటుంది. మనం ఉద్యోగం పోయి కష్టకాలంలో ఉంటే పీఎఫ్ డబ్బు కోసం దరఖాస్తు చేసుకుంటే మనకు డబ్బు తిరిగి వస్తుంది. దీంతో మన కష్టాలు గట్టెక్కుతాయి. కానీ చాలా మందికి ఈ విషయం తెలియక ఇబ్బందులు పడుతుంటారు.
తాజా మార్గదర్శకాల ప్రకారం మన పీఎఫ్ ను ఎప్పుడైనా తీసుకోవచ్చు. మనం కావాలని అడిగితే కచ్చితంగా ఇచ్చేయాల్సిందే. ఇలా నూతన మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. అందుకే మనకు ఉద్యోగం పోయినా, ఇతర అవసరాలు ఉన్నా పీఎఫ్ సొమ్ము కావాలని కోరితే ఇచ్చేందుకు సంబంధిత శాఖ రెడీ అంటుంది. మన డబ్బు మనకు ఇస్తుంది.
పీఎఫ్ సొమ్ము మనం రిటైర్మెంట్ వరకు ఉంచుకుంటే వడ్డీ వస్తుంది. కానీ ప్రస్తుత రోజుల్లో అప్పటి దాకా ఉంచుకోవడం వీలు కాదు. దీంతో పీఎఫ్ ను మనం ఎప్పుడైనా తీసుకోవడం వీలవుతుంది. మనకు అవసరమైనప్పుడు తీసుకుని వాడుకోవచ్చు. ఇలా పీఎఫ్ వాడకంలో మనకు అనుకూలంగా ఉండే అంశాలే ఎక్కువగా ఉంటున్నాయి.