
Eat on time : ప్రస్తుతం మనం తినడానికి సమయపాలన పాటించడం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తింటున్నాం. ఫలితంగా రోగాలు వస్తున్నాయి. అయినా మనం లెక్కచేయడం లేదు. పని భారంతో మనం తీసుకునే ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, గుండెజబ్బుల ముప్పు ఎదుర్కొంటున్నాం. ప్రజల్లో చైతన్యం వస్తేనే ఇవి సాధ్యమవుతాయి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండేందుకు వీలవుతుంది.
వేళాపాలా లేని తిండితో మన రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఎప్పుడు పడితే అప్పుడు తినడం అంత మంచిది కాదు. మన ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. సమయపాలన పాటించడం కొంచెం కష్టమే అయినా ఆరోగ్య రీత్యా తప్పదని తెలుసుకోవాలి. లేకపోతే మనకు జబ్బులు సోకే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
సమయపాలన లేని తిండితో మన ఆరోగ్యం దెబ్బతిని కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశముంటుంది. వ్యాధులు వస్తే ఇక అంతే సంగతి. జీవితాంతం మందులు మింగాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలో గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలతో ఇబ్బందులు పడటం ఖాయం. శరీరంలో జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే మనం వేళకు తిండి తినడం అలవాటుగా చేసుకోవాలి.
రోజుకు మూడు పూటలు సమయం ప్రకారం తింటే మనకు సమస్యలు రావు. ఆరోగ్యం బాగుంటుంది. కానీ సమయం ప్రకారం తినేందుకు మనం చొరవ చూపాలి. కచ్చితమైన వేళల ప్రకారమే ఆహారం తీసుకుంటే మనకు నష్టం ఉండదు. మన ఆహారాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్ కష్టంగానే మారుతుంది. దీనిపై ఎవరైనా సరే సమయపాలన పాటించాల్సిందే.