Bolashankar : చిరంజీవి, తమన్నా జంటగా నటించిన సినిమా భోళా శంకర్. రేపు విడుదల అవుతోంది. దీంతో భోళా మేనియా పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. భోళా శంకర్ విడుదల సందర్భంగా ఆయన అభిమానులు ర్యాలీ తీశారు. ఇంతవరకు ఏ హీరోకు కూడా ఇలా ర్యాలీ తీయలేదు. చిరంజీవి గొప్పతనాన్ని చాటుతూ చిరంజీవి బ్లడ్ బ్యాంకు నుంచి ర్యాలీ ప్రారంభించారు.
హైదరాబాద్ వీధుల్లో 600కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు. జీపీఎస్ ట్రాకింగ్ మొత్తంగా చూస్తే మెగాస్టార్ ముఖ చిత్రం కనిపించేలా ర్యాలీ చేపట్టడం విశేషం. భోళా శంకర్ పై ఇప్పటికే ఎన్నో రకాల ప్రచారాలు చేపట్టారు. సామాజిక మాధ్యమాలే వేదికగా భోళా శంకర్ గురించి ఉవ్వెత్తున ప్రచారం ఎగసిపడుతోంది. సినిమా హిట్టవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
భోళా శంకర్ విడుదల రేపే కావడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇటీవల మెగాస్టార్ అభిమానులు ఏకంగా ఆయన 126 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేయడం విశేషం. సూర్యపేట, విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న రాజుగారి తోట వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. టాలీవుడ్ లోనే ఇంత పెద్ద కటౌట్ ఇంతవరకు ఏర్పాటు చేయలేదని అంటున్నారు.
ఈ సినిమాతో మరోసారి చిరంజీవి తన సత్తా చాటుతారని కోరుతున్నారు. సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. భోళా శంకర్ తో చిరు మరోమారు తన తడాఖా చూపిస్తారంటున్నారు. వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్ తో హిట్లు అందుకున్న చిరు మరో హిట్ అందుకుని హ్యాట్రిక్ కొడతారని చెబుతున్నారు. ఇలా చిరంజీవి తన ప్రస్థానంలో ఇలాంటి హిట్లు కొడుతూ వెళతారని అభిప్రాయపడుతున్నారు.